తగ్గిన జీఎస్టీ: ఏయే వస్తువులపై ఎంత?

  • 11 నవంబర్ 2017
GST Image copyright Getty Images

అసోంలోని గువాహటిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో 50 వస్తువులను మాత్రమే 28 శాతం జీఎస్టీ శ్లాబ్ కింద ఉంచాలని నిర్ణయించారు.

జులై 1, 2017 న దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వచ్చింది. మొదట 228 వస్తువులు 28 శాతం జీఎస్టీ శ్లాబ్ పరిధిలో ఉండగా, ఇప్పుడు 178 వస్తువులను ఆ శ్లాబ్ నుంచి తప్పించాలని నిర్ణయించారు.

వాటిని ఇప్పుడు 18 శాతం పన్ను శ్లాబ్‌లోనికి తీసుకువచ్చారు.

ఈ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. పన్ను శ్లాబులో చేసిన మార్పులు నవంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయని అన్నారు.

13 వస్తువులను 18 శాతం పన్ను శ్లాబ్ లోంచి 12 శాతం పరిధిలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

దాంతో పాటు 6 వస్తువులను 18 శాతం శ్లాబ్ నుంచి 5 శాతం శ్లాబ్‌ కిందకు తెచ్చారు. 8 వస్తువులపై 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు.

6 వస్తువులపై 5 శాతం ఉన్న జీఎస్టీని పూర్తిగా తొలగించారు.

Image copyright Getty Images

28 శాతం శ్లాబ్ నుంచి 18 శాతం శ్లాబ్‌ పరిధిలోనికి వచ్చినవి:

  • మోటర్ కార్
  • మోటర్ సైకిల్
  • చాకొలేట్లు, కొకోవా బటర్, కొవ్వు పదార్థాలు, నూనె
  • పాన్ మసాలా
  • రెఫ్రిజిరేటర్లు
  • పెర్‌ఫ్యూమ్, డియోడరెంట్
  • మేకప్ యాక్సెసరీలు
  • వాల్ పుట్టీ
  • వాల్ పెయింట్
  • టూత్ పేస్టులు
  • షేవింగ్ క్రీములు
  • ఆఫ్టర్ షేవ్
  • లిక్విడ్ సోప్
  • ప్లాస్టిక్ ఉత్పత్తులు
  • రబ్బర్ టైర్లు
  • లెదర్ బ్యాగులు
  • మార్బుల్, గ్రానైట్, ప్లాస్టర్, మైకా
  • టెంపర్డ్ గ్లాస్
  • రేజర్లు
  • డిష్ వాషింగ్ మెషీన్లు

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)