అగ్గిపెట్టె, బ్రా, బ్రీఫ్‌కేస్, గొడుగు.. ఇవన్నీ గూఢచారుల పరికరాలు!

  • 14 నవంబర్ 2017
బెర్లిన్, జర్మనీ, గూఢచర్యం Image copyright Getty Images

ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా బెర్లిన్‌ మధ్యలో ఓ గోడ కట్టి దాన్ని రెండుగా విభజించారన్న విషయం తెలిసిందే. అయితే ఆ తరువాతే బెర్లిన్ ప్రపంచంలోనే అతి పెద్ద గూఢచార నగరంగా మారిందని 'జర్మన్ మ్యూజియం ఆఫ్ అస్పినాజ్' పరిశోధనా విభాగ ముఖ్య అధిపతి క్రిస్టోఫర్ నెహరింగ్ తెలిపారు.

బెర్లిన్‌లో వేలాది మంది గూఢచారులు ఉండేవారని ఆయన అన్నారు. వారంతా తమ శ్రతువులపై పై చేయి సాధించేందుకు కీలక సమాచారాన్ని సేకరిస్తూ ఉండేవారు.

బెర్లిన్‌ను నాలుగు భాగాలుగా విభజించారు.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా దేశాలకు చెందిన గూఢచారులు బెర్లిన్‌లోనే ఉండేవారు. వారంతా వివిధ పద్ధతుల్లో గూఢచర్యం చేసేవారు.

"ఈ నాలుగు దేశాల గూఢచారులందరూ బెర్లిన్‌లోనే ఉండేవారు. కానీ వీరందరిలో జీడీఆర్ (జర్మన్ డెమోక్రాటిక్ పబ్లిక్) కు చెందిన స్టేట్ సెక్యూరిటీ సర్వీసు ప్రత్యేకం. వారిని 'స్టేసీ' అని పిలిచేవారు. స్టేసీ దగ్గర నిధులు ఎక్కువగా ఉండేవి. ప్రతిచోటా స్టేసీ గూఢచారులు ఉండేవారు. వీరి సంఖ్య కూడా అధికంగా ఉండేది. సమాచారాన్ని విశ్లేషించడంలో వారికి అంత గొప్ప నైపుణ్యత లేకున్నా గూఢచర్య పరికరాల తయారీలో మాత్రం వారికి తిరుగులేదు" అని క్రిస్టోఫర్ తెలిపారు.

అప్పటి గూఢచర్య పరికరాలలో కొన్ని పరికరాల గురించి తెలుసుకుందాం.

Image copyright GERMAN MUSEUM OF ESPIONAGE

1) అగ్గిపెట్టెలో కెమెరా

కేజీబీ మినీ కెమెరాలను తయారు చేసేందుకు తూర్పు జర్మనీ గూఢచర్య ఏజెన్సీ, రష్యా గూఢచర్య ఏజెన్సీలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి.

మినీ కెమెరాలతో గూఢచారులకు ఎన్నో లాభాలు కలిగాయి.

అగ్గిపెట్టెలో ఉన్న ఈ కెమెరాను స్టేసీ తయారు చేసింది. ఈ కెమెరాను దుస్తుల్లో ఎక్కడైనా దాచిపెట్టుకొని తీసుకెళ్లొచ్చు.

ఈ కెమెరా సహాయంతో గూఢచారులు చిన్న చిన్న వీడియోలు రికార్డు చేసేవారు. ఈ అగ్గిపెట్టె డబ్బా సైజు 5 x 3.5 x 1.5 సెంటీమీటర్లు.

Image copyright GERMAN MUSEUM OF ESPIONAGE

2) ఉహుప్యాన్ స్టిక్‌లో కెమెరా

ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండాలని నిత్యజీవితంలో వాడే వస్తువుల్లో కెమెరాను అమర్చారు. స్టేసీ ఈ కెమెరాను ఈ ప్యాన్ స్టిక్కర్‌లో తయారు చేసింది.

దీనిని ఎక్కడంటే అక్కడ అంటించే వారు. ఈ కెమెరా జర్మనీలో చాలా పేరుమోసింది.

Image copyright GERMAN MUSEUM OF ESPIONAGE

3) బ్రాలో కెమెరా

కెమెరాను దాచేందుకు స్టేసీ బ్రాను కూడా ఉపయోగించింది. గూఢచారులు దగ్గరి నుంచి తమ శత్రువుల వీడియోలు తీసేందుకు దీనిని వాడేవారు.

"తూర్పు జర్మనీ నిఘా సంస్థ దీనిని తయారు చేసింది. కానీ దానిని ఎప్పుడూ వాడలేదు" అని క్రిస్టోఫర్ నెహరింగ్ తెలిపారు.

Image copyright GERMAN MUSEUM OF ESPIONAGE

4) ఫోటో స్నైపర్

కొన్నిసార్లు గూఢచారులకు దూరం నుంచి, క్లిష్ట పరిస్థితిల్లో ఫోటోలు తీయాల్సి వచ్చేది.

అప్పుడే రైఫిల్‌లా కనిపించే ఈ పరికరాన్ని మాస్కోకు చెందిన కెఎంజెడ్ కంపెనీ తయారు చేసింది. 300 ఎంహెచ్ సూపర్ టెలిఫోటో సామర్థ్యం ఉన్న ఈ ఎస్ఎల్ఆర్ కెమెరాతో దూరం నుంచి ఫోటోలు తీయగలిగేవారు.

Image copyright GERMAN MUSEUM OF ESPIONAGE

5) నాణెల్లో మైక్రోఫిల్మ్ పరికరం

తాము తీసిన ఫోటోలు ఎవరికీ కనిపించకుండా తమ ఏజెన్సీకి పంపించాల్సి వచ్చేది.

దీంతో మైక్రోఫిల్మ్ టెక్నాలజీని ఉపయోగించడం మొదలుపెట్టాయి.

గూఢచారులు పాత నాణేలను తీసుకొని, వాటి వెనుక మైక్రోఫిల్మ్ పరికరాలను పెట్టి ఏజెన్సీలకు పంపించేవారు.

Image copyright GERMAN MUSEUM OF ESPIONAGE

6) వాసనను భద్రపరిచే పరికరం

శత్రువులను గుర్తించేందుకు గూఢచారులకు కేవలం ఫోటోలు మాత్రమే కాదు శత్రువుల శరీర వాసన కూడా కొన్ని సార్లు కీలక పాత్ర పోషిస్తుంది.

"స్టేసీ సభ్యులు విచారణ సమయంలో శత్రువుల శరీరంపై ఓ గుడ్డను రుద్ది వారి శరీరం వాసనను తమ దగ్గర పెట్టుకునేవారు. ఆ బట్టను ఒక జార్‌లో భద్రపరిచేవారు. ఎప్పుడైనా వారికి అనుమానమొస్తే డాగ్‌ స్క్వాడ్ సహాయంతో శత్రువులను గుర్తు పట్టేవారు." అని క్రిస్టోఫర్ నెహరింగ్ తెలిపారు.

Image copyright GERMAN MUSEUM OF ESPIONAGE

7) దుర్గంధాలను తొలగించే రహస్య స్ప్రే

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గూఢచారులు తబ్యాక్ బ్రాండ్‌కు చెందిన స్ప్రేను వాడేవారు. ఈ రహస్య స్ప్రే దుర్గంధాలను తొలగిస్తుంది. ఈ స్ప్రేను మైక్రోఫిల్మ్ నుంచి చిన్న చిన్న పత్రాలను తరలించేందుకు వాడేవారు.

దీనిని యూరప్‌లోని ఎనిమిది కమ్యూనిస్ట్ దేశాల కూటమి 'వార్సా కూటమి'కి చెందిన నిఘా ఏజెంట్లు వాడారు.

Image copyright GERMAN MUSEUM OF ESPIONAGE

8) ఈ బ్రీఫ్‌కేస్‌తో చావు తప్పదు

గూఢచారులకు కొన్ని సార్లు శత్రువును చంపేందుకు బాగా దగ్గరి వరకూ వెళ్లాల్సి వచ్చేది. వారు తప్పించుకోకుండా ఉండటానికి గూఢచారులు వివిధ పద్ధతులు ఉపయోగించేవారు. అందులో అత్యంత ప్రమాదకరమైన పధ్ధతి ఇదే.

చూడ్డానికి బ్రీఫ్‌కేస్‌లా కనిపించే ఈ పరికరంలో స్కార్పియన్ గన్ ఉంటుంది. స్టేసీ సభ్యులు దీన్ని వాడేవారు. శత్రువును చంపేందుకు వెంటనే ఆయుధాన్ని బ్రీఫ్‌కేస్ లోపలి నుంచే ప్రయోగించొచ్చని 'జర్మన్ మ్యూజియం ఆఫ్ అస్పినాజ్' వర్గాలు తెలిపాయి.

Image copyright GERMAN MUSEUM OF ESPIONAGE

9) బల్గేరియన్ గొడుగు

కేజీబీ గూఢచారులు ఈ గొడుగును ఉపయోగించే బీబీసీ పాత్రికేయులు జార్జ్ మార్కోవ్‌కు విషమిచ్చి హత్య చేశారని అంటారు. ఈ ఘటన నవంబరు 7, 1978లో జరిగింది.

అప్పుడు జార్జ్ మార్కోవ్ లండన్ లోని వాటర్‌లూ బ్రిడ్జిపై ఉన్నారు. తనపై ఓ వ్యక్తి గొడుగుతో దాడి చేశాడని మార్కోవ్ తనకు చికిత్స అందించిన వైద్యుడితో అన్నారు.

ఆ తర్వాత జరిగిన ఫోరెన్సిక్ పరీక్షలో ఆయన తొడలో ఓ చిన్న పరికరం దొరికింది. ఆ పరికరం ఆయన శరీరంలో ఓ విషపూరిత పదార్థం విడుదల చేసిందని తేలింది.

కేజీబీ ఏజెంటు గొడుగుపై భాగాన్ని తన కాళ్ల వెనుక ఉంచి, ఒక బటన్ నొక్కాడు. దీంతో ఓ సిలిండర్ యాక్టివేట్ అయి ఓ యంత్రం బయటికొచ్చి మార్కోవ్ శరీరంలోకి చొచ్చుకెళ్లిందని నిపుణులు తేల్చారు..

మార్కోవ్ 49 ఏళ్ల వయసులో మృతిచెందారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)