మానుషి ఛిల్లర్: మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న ఆరో భారతీయురాలు

  • 18 నవంబర్ 2017
మానుషి చిల్లార్ Image copyright Getty Images

మిస్ వరల్డ్ 2017గా నిలవడంతో 20 ఏళ్ల మానుషి చిల్లర్ పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగిపోతోంది.

హరియాణాలో పుట్టిన ఈ యువతి వైద్య విద్యను అభ్యసిస్తూనే ఇప్పుడు ప్రపంచం మెచ్చిన అందగత్తె అయింది. 17 ఏళ్ల తర్వాత విశ్వసుందరి కిరీటాన్ని భారత్‌కు అందించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మానుషి చిల్లర్‌ను అభినందిస్తున్న మిస్ వరల్డ్ 2016 విజేత స్టెఫానీ డెల్ వల్లె

ఆమె గురించి కొన్ని సంగతులు

  • భారత్ నుంచి వైద్య విద్యార్థిగా మిస్ వరల్డ్ పోటీల్లో గెలుపొందిన రెండో యువతి మానుషి. ఆమె కంటే ముందు రీటా ఫారియా (1966లో) చివరి సంవత్సరం వైద్య విద్యార్థిగా ఉండగానే మిస్ వరల్డ్‌ పోటీల్లో గెలుపొందారు.
  • మానుషి తల్లిదండ్రులు మిత్రా మసు ఛిల్లర్, నిలీమా ఛిల్లర్ ఇద్దరూ డాక్టర్లే.
Image copyright Getty Images
  • గతేడాది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు ఆమె ఒక విద్యా సంవత్సరానికి దూరమ్యారు.
  • మిస్ ఇండియా కిరిటీం గెలుచుకున్నప్పటి నుంచి ‘ప్రాజెక్టు శక్తి’లో భాగంగా మహిళలకు నెలసరి సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈ ఏడాది జరిగినవి 67వ మిస్ వరల్డ్ పోటీలు
  • స్కెచింగ్, పేయింటింగ్ మానుషి ఇష్టమైన వ్యాపకాలు. ఆమె క్లాసికల్ డ్యాన్సర్ కూడా.
  • స్కూబాడైవింగ్, బంగీజంప్‌లంటే కూడా ఆమెకు చాలా ఇష్టం.
  • మిస్ వరల్డ్ కిరీటం గెలవడం ఆమె చిన్ననాటి కోరిక. చాలా ఇంటర్య్వూల్లో ఆమె ఈ విషయం చెప్పారు. స్కూల్, కాలేజీ స్థాయిల్లోనూ అనేక అందాల పోటీల్లో మానుషి విజేతగా నిలిచారు.
  • మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న 6వ భారతీయురాలు మానుషి.
Image copyright Getty Images
చిత్రం శీర్షిక చైనా దీవి హైనన్‌లోని సన్యా నగరంలో ఈ ఏడాది ప్రపంచ సుందరి ఎంపికకు తుది పోటీ జరిగింది

భారత ప్రపంచ సుందరీమణులు వీరే..

1951 లో బ్రిటన్‌కు చెందిన ఎరిక్ మెర్లే ఈ పోటీలకు రూపకల్పన చేశారు. అదే ఏడాది జులై 29న మొదటిసారి లండన్‌లో పోటీలు నిర్వహించారు. మొట్టమొదటి ప్రపంచ సుందరిగా స్వీడన్‌కు చెందిన కికి హకన్సన్ నిలిచారు.

ఈ పోటీలు మొదలైన 15 ఏళ్ల తర్వాత భారతీయ యువతి తొలిసారి ఈ కిరీటాన్ని గెలుపొందారు.

ఇప్పటివరకు 6 గురు భారతీయ యువతులు మిస్ వరల్డ్ కిరీటాన్ని చేజిక్కించుకున్నారు.

1966లో రీటా ఫారియా మొదటిసారిగా ప్రపంచ సుందరిగా నిలిచారు.

ఆ తర్వాత చాలా ఏళ్లకు ఐశ్వర్యరాయ్ 1994లో మిస్ వరల్డ్‌గా నిలిచారు.

1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరిగా నిలిచారు.

17 ఏళ్ల తర్వాత 2017 మిస్ వరల్డ్ కిరీటాన్ని మళ్లీ భారత్‌కు చెందిన మానుషి చిల్లర్ సొంతం చేసుకున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)