భారత్-జింబాబ్వే మధ్య 15వ శతాబ్దం నుంచే వాణిజ్య సంబంధాలు

  • 19 నవంబర్ 2017
రాబర్ట్ ముగాబే Image copyright Reuters
చిత్రం శీర్షిక రాబర్ట్ ముగాబే

అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే గృహ నిర్బంధంతోపాటు జింబాబ్వేలో ఇటీవల జరిగిన ఇతర పరిణామాలు చాలా మంది భారతీయులనూ ఆలోచింపజేసేవే. ఈ తరుణంలో భారత్-జింబాబ్వే సంబంధాలపై ఇదొక పరిశీలన.

ఆఫ్రికా ఖండం దక్షిణ భాగంలో ఉండే జింబాబ్వే, ఆసియా ఖండం దక్షిణ ప్రాంతంలో ఉండే భారత్ మధ్య సుదీర్ఘ కాలంగా బహుముఖ సంబంధాలు ఉన్నాయి.

ఆర్థిక, వాణిజ్య సంబంధాలు వీటిలో అత్యంత ప్రధానమైనవి.

15వ శతాబ్దం నుంచే రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం ఉంది. జింబాబ్వే అప్పట్లో ముటపా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.

రాజ కుటుంబానికి చెందిన పలువురు భారత్‌లో చదువుకున్నారు కూడా. భారత వ్యాపారులకు రాజకుటుంబం అండగా ఉండేది.

స్వాతంత్రోద్యమానికి మద్దతిచ్చిన భారత్

జింబాబ్వే స్వాతంత్ర్య ఉద్యమానికి భారత్ సంపూర్ణ మద్దతు అందించింది.

1980లో జింబాబ్వే స్వాతంత్ర్యం సాధించిన అనంతరం జరిగిన వేడుకల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పాల్గొన్నారు. తర్వాత రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింతగా వికసించాయి.

Image copyright Photo Division
చిత్రం శీర్షిక జింబాబ్వే స్వాతంత్ర్యం సాధించిన అనంతరం జరిగిన వేడుకల్లో ఇందిరా గాంధీ పాల్గొన్నారు.

1980 నుంచి 1994 మధ్య ముగాబే వివిధ హోదాల్లో ఆరుసార్లు భారత్‌ను సందర్శించారు. భారత ప్రధాన మంత్రులుగా చేసిన వారిలో రాజీవ్ గాంధీ, హెచ్‌డీ దేవెగౌడ జింబాబ్వేలో పర్యటించారు.

ప్రధాని హోదాలో పీవీ నరసింహారావు జీ-15 సదస్సు సందర్భంగా ముగాబేతో సమావేశమయ్యారు.

1996 తర్వాత రెండు దేశాల మధ్య ఈ స్థాయి రాజకీయ సంబంధాలు హఠాత్తుగా ఆగిపోయాయి.

కానీ ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఐఆర్‌సీవోఎన్), రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ (ఆర్ఐటీఈఎస్) లాంటి భారత సంస్థలకు, జింబాబ్వేకు మధ్య వాణిజ్యపరంగా మంచి సంబంధాలే కొనసాగాయి.

Image copyright RAVEENDRAN/AFP/Getty Images
చిత్రం శీర్షిక జీ-15 సదస్సు సందర్భంగా ముగాబేతో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు సమావేశమయ్యారు.

ఆఫ్రికాలో చైనా భారీ పెట్టుబడులు

ఇంతలో, ఆఫ్రికాలో చైనా భారీగా పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టింది. ఇదే విషయమై 2000వ సంవత్సరంలో చైనా-ఆఫ్రికా సహకార ఫోరంను ఏర్పాటు చేసింది. ఫోరం తొలి సమావేశం చైనా రాజధాని బీజింగ్‌లో జరిగింది.

చైనా వ్యూహాల పట్ల భారత్ అప్రమత్తమైంది. 2008లో భారత్-ఆఫ్రికా ఫోరం సదస్సును నిర్వహించింది.

ఇప్పటివరకు ఈ సదస్సులు మూడు జరిగాయి. రెండుసార్లు దిల్లీలో, ఒకసారి ఇథియోపియా రాజధాని అడీస్ అబాబాలో నిర్వహించారు.

తొలి రెండు సదస్సులు అంతగా విజయవంతమవ్వలేదు. 10-15 ఆఫ్రికా దేశాలే పాల్గొన్నాయి.

2015లో దిల్లీలో జరిగిన మూడో సదస్సుకు మాత్రం 40కి పైగా ఆఫ్రికా దేశాల నాయకులు హాజరయ్యారు. వీరిలో ముగాబే ఒకరు. రెండు దశాబ్దాలకు పైగా కాలంలో ఆయన భారత్‌కు రావడం అదే తొలిసారి.

సదస్సుకు వచ్చిన వివిధ దేశాల నాయకులను భారతీయ సంప్రదాయ దుస్తులు కుర్తీ, జాకెట్ ధరించాలని భారత్ కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీదుగా ఈ జాకెట్‌నే మోదీ-జాకెట్ అని కూడా వ్యవహరిస్తుంటారు.

సదస్సుకు హాజరైన ఆఫ్రికా నాయకుల్లో ఒక్క ముగాబే తప్ప అందరూ మోదీ-జాకెట్‌ను ధరించారు. ముగాబే మాత్రం తాను ఎప్పుడూ ధరించే గ్రే సూటే వేసుకుంటానని స్పష్టం చేసి, అదే వేసుకున్నారు.

ఈ సంఘటన భారత్, జింబాబ్వే రెండు దేశాల్లో వార్తాంశం అయ్యింది.

"ముగాబే ఎన్నడూ తన బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్‌ను విడవరు. అంతేగాకుండా, వయసు పైబడటంతో వెన్ను నిటారుగా ఉండేలా ఆయన ఒక ప్రత్యేకమైన బెల్టును కూడా వాడుతున్నారు. ముగాబే తన సూట్లను తన అవసరాలకు తగినట్లుగా ప్రత్యేకంగా కుట్టించుకుంటారు" అని ముగాబే నేతృత్వంలోని 'జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్-పేట్రియాటిక్ ఫ్రంట్ (జను-పీఎఫ్)' నాయకుడిని ఒకరిని ఉటంకిస్తూ మీడియా సంస్థ 'న్యూ జింబాబ్వే' తెలిపింది.

ముగాబే ప్రపంచంలోకెల్లా అత్యధిక వయసున్న అధ్యక్షుడు. 93 ఏళ్ల ముగాబేను ఆయన ప్రత్యర్థులు నియంతగా పేర్కొంటారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి: 'ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా'

'ఇంగ్లిష్ మీడియం బిల్లు'కు రెండోసారి ఏపీ అసెంబ్లీ ఆమోదం.. ఇప్పుడు మండలిలో ఏం జరుగుతుంది..

కరోనా వైరస్‌: చైనాలో మరో నగరానికి రాకపోకలు నిలిపివేత

‘రోహింజ్యాలపై మారణహోమం ఆపేందుకు చర్యలు తీసుకోండి’- మయన్మార్‌కు ఐసీజే ఆదేశం

ఆంధ్రప్రదేశ్: శాసన మండలిలో అసలేం జరిగింది? సెలెక్ట్ కమిటీ ఏం చేస్తుంది

చనిపోయిన వ్యక్తి నుంచి వీర్యం సేకరించి పిల్లలు పుట్టించొచ్చా

పీవీ సింధు విజయాల వెనుక పీబీఎల్‌ పాత్ర కూడా ఉందా

రజినీకాంత్ చెప్పిన దాంట్లో నిజమెంత... సీతారాముల నగ్నవిగ్రహాలకు పెరియార్ చెప్పుల దండలు వేసి ఊరేగించారా..

బెజోస్ ఫోన్ హ్యాకింగ్: అమెజాన్ బిలియనీర్ ఫోన్‌ని సౌదీ యువరాజు హ్యాక్ చేశారా?