ఇందిరాగాంధీ: బహుశా ఈ ఫొటోలు మీరెప్పుడూ చూసుండరు!
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శతజయంతి సందర్భంగా ఆమె అరుదైన ఫొటోలలో కొన్నింటిని చూద్దాం.

ఫొటో సోర్స్, Indira Gandhi Memorial Trust, Archive
1917 నవంబర్ 19న ఇందిరాగాంధీ జన్మించారు. ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇందిరా ప్రియదర్శిని.
ఫొటో సోర్స్, Indira Gandhi Memorial Trust, Archive
తనకు ఆడపిల్ల పుట్టిందని తండ్రి జవహర్లాల్ నెహ్రూ గర్వంగా చెప్పుకునేవారు.
ఫొటో సోర్స్, Indira Gandhi Memorial Trust, Archive
భారత జాతిపిత మహాత్మాగాంధీతో ఇందిరాగాంధీ
ఫొటో సోర్స్, Indira Gandhi Memorial Trust, Archive
1942 మార్చి 26న ఇందిరా, ఫిరోజ్ గాంధీల వివాహం అలహాబాద్‌లో జరిగింది.
ఫొటో సోర్స్, Indira Gandhi Memorial Trust, Archive
కశ్మీర్‌కు హనీమూన్‌కి వెళ్లినప్పటి ఇందిరాగాంధీ ఫొటో
ఫొటో సోర్స్, Indira Gandhi Memorial Trust, Archive
1959లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
ఫొటో సోర్స్, Indira Gandhi Memorial Trust, Archive
1971 మార్చి 18న భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీతో రాష్ట్రపతి వీవీ గిరి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఫొటో సోర్స్, Indira Gandhi Memorial Trust, Archive
ఇందిరాగాంధీతో కుటుంబ సభ్యులు సంజయ్, రాజీవ్, మేనకా, సోనియా, ప్రియాంక, రాహుల్
ఫొటో సోర్స్, Indira Gandhi Memorial Trust, Archive
నానమ్మ ఇందిరాగాంధీతో రాహుల్, ప్రియాంకాగాంధీ కలిసి ఉన్న అరుదైన చిత్రం
ఫొటో సోర్స్, Indira Gandhi Memorial Trust, Archive
1969 జనవరి: లండన్‌లో రాణి ఎలిజబెత్- IIతో ఇందిరాగాంధీ
ఫొటో సోర్స్, Indira Gandhi Memorial Trust, Archive
1972 జూలై: పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్- అలి- బుట్టోతో కలిసి సిమ్లాలో ఇందిర దిగిన ఫొటో
ఫొటో సోర్స్, Getty Images
భారత్- నేపాల్ సరిహద్దులోని ప్రజలు జరుపుకునే 'తీజ్' ఉత్సవంలో..
ఫొటో సోర్స్, Indira Gandhi Memorial Trust, Archive
ఇది దిల్లీలో సఫ్దర్‌జంగ్‌లోని ఇందిరాగాంధీ అధికారిక నివాసం. ఇక్కడే అక్టోబర్ 31, 1984న తన అంగరక్షకుల కాల్పుల్లో ఆమె మరణించారు.
ఫొటో సోర్స్, Indira Gandhi Memorial Trust, Archive
ఇందిరాగాంధీ పార్థీవదేహానికి నివాళులర్పిస్తున్న ప్రజలు
ఫొటో సోర్స్, Getty Images
1984 నవంబర్ 3న ఇందిరాగాంధీ అంత్యక్రియలు నిర్వహించారు.