పట్టాలు తప్పిన వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్, ముగ్గురు మృతి

  • 24 నవంబర్ 2017
బ్రేకింగ్ న్యూస్

గోవా నుంచి పట్నా వెళ్తున్న వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్ రైలుకి చెందిన 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లా మాణిక్‌పూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని, 9మంది గాయపడ్డారని చిత్రకూట్ ఎస్పీ ప్రతాప్ గోపేంద్ర యాదవ్ బీబీసీకి తెలిపారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని, గాయపడినవారిని ఆస్పత్రిలో చేర్చామని ఆయన చెప్పారు.

ఈ ఘటన తెల్లవారుఝామున 4.18కి జరిగింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు