నేనేమి చేశాను నేరం!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

గుక్కపెట్టి ఏడ్చినా అమ్మ వచ్చేనా?

  • 27 నవంబర్ 2017

చూడచక్కని రూపం. ముద్దొచ్చే చిట్టిపొట్టి మాటలు. బుడి బుడి అడుగుల బుజ్జి బుజ్జి పాపాయిల అల్లరి కూడా ఆనందమే. కానీ ఆ తల్లిదండ్రులకు కంటిపాపే భారమైంది. ముళ్లపొదే తల్లిఒడి అయింది. ఎలాగోలా శిశుగృహానికి చేరినా.. ఈ పసి పాపలకు అకాల మరణం తప్పడం లేదు.

నల్లగొండ జిల్లా శిశుగృహలో మూడు నెలల్లో 10మంది చిన్నారులు చనిపోయారు. చిన్నారుల అనారోగ్యమే దీనికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే, శిశుగృహ సిబ్బంది నిర్లక్ష్యం, పౌష్టికాహార లోపం కూడా ఒక కారణమని స్థానికులు అంటున్నారు. దీనిపై నిజ నిర్ధరణకు రెండు కమిటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు.

మా ఇతర కథనాలు :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)