మరణశిక్షతో నేరాలు తగ్గుతాయా?

  • 27 నవంబర్ 2017
నేరాలు Image copyright Getty Images

12ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారికి ఉరిశిక్ష వేసే విధంగా చట్టాన్ని రూపొందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో దీనిపై చట్టం చేయాలని భావిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 140 దేశాలు మరణశిక్షను రద్దు చేశాయి (ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం). ఇతర దేశాలూ ఆ బాటలో నడవాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది.

అయితే, శిక్ష తీవ్రతను పెంచితే నేరాలను అదుపుచేయగలమా? దోషులకు మరణ శిక్ష వేస్తే నేరాల రేటు తగ్గుతుందా? ఈ అంశాలపై బీబీసీ న్యూస్ తెలుగు మాటకు మాట ద్వారా నెటిజన్ల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది.

వారు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో కొన్ని...

ప్రజాప్రతినిధులు చట్టాల్ని దుర్వినియోగం చేస్తుంటే ఎన్ని చట్టాలుంటే ఏమి ఉపయోగం అని @dasari_manash ట్విటర్లో ప్రశ్నించారు.

మద్యంపై నిషేధం విధిస్తే అన్ని రకాల నేరాలు తగ్గుతాయని @v_rajeshbabu అనే నెటిజన్ అభిప్రాయపడుతున్నారు.

ఈ చట్టాన్ని తీసుకువస్తే... 100 శాతం నేరాలు తగ్గుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరో యూజర్ @Nameis_KrishNa.

ఎన్ని చట్టాలనున్నా శిక్షలు పడి, అవి అమలయ్యేనాటికి సమయం మించిపోతోందంటూ దేవపట్ల లోకేష్ రెడ్డి ఫేస్‌బుక్‌‌లో తెలిపారు.

Image copyright Facebook

చావుకు భయపడనివారుండరు కాబట్టి కచ్చితంగా నేరాలు తగ్గుతాయని శివ ప్రసాద్ ఫేస్‌బుక్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Image copyright Facebook

హత్య చేస్తే శిక్ష పడుతుందని తెలిసినా అవి ఆగటం లేదు కదా అని కృష్ణారావు కామెంట్ చేశారు. శిక్షలే నేరాల్ని తగ్గిస్తాయనుకుంటే ఇస్లామిక్ దేశాల్లో నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అని ప్రశ్నిస్తున్నారు వెంకీ రెడ్డి.

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు