పద్మావత్ సినిమాపై వివాదం నెలకొంది. దీన్ని వ్యతిరేకించేవారు కొందరైతే, సమర్థించేవారు మరికొందు. మరి ఈ సినిమాలో పద్మావతిగా నటించిన దీపిక పదుకొణె ఏమంటున్నారు?
'పద్మావత్' చిత్రం విషయంలో నెలకొన్న వివాదాలపై నటి దీపికా పదుకొణె బీబీసీతో మాట్లాడారు.
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం 'పద్మావత్'లో దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో నటించారు.
డిసెంబర్లో విడుదల కావాల్సిన ఆ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. సినిమాను విడుదల చేయొద్దంటూ పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఈ వివాదంపై దీపిక స్పందించారు.
అంతే కాదు.. పదేళ్ల కిందట తాను కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ సినీ పరిశ్రమలో ఎలాంటి మార్పులు వచ్చాయో, తనకు చరిత్రపై ఎలాంటి ఆసక్తి ఉందో కూడా ఆమె ఈ ఇంటర్వ్యూలో వివరించారు.
ఈ ముఖాముఖిని నవంబర్ 16న బీబీసీ ముంబయి ప్రతినిధి యోగిత లిమాయె రికార్డు చేశారు.
మా ఇతర కథనాలు
- నాడు దీపిక పదుకొణెకు సెక్యూరిటీ ఇచ్చి.. నేడు పద్మావత్ వ్యతిరేకంగా ఉద్యమం
- ‘నన్ను ప్రేమించినందుకు నా భర్తను హత్య చేశారు’
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
- 'పద్మావత్'పై ఎందుకింత ఆగ్రహం?
- ‘పద్మావతిని ఆడనివ్వను.. ముస్లింలను పట్టించుకోను": ఎమ్మెల్యే రాజాసింగ్
- పద్మావతి సినిమా విడుదల వాయిదా
- ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్టూ వేధింపేనా?
- ‘మగాళ్లు చేస్తే ఒప్పు ఆడవాళ్లు చేస్తే తప్పా?’
- ఎర్ర పీతలు: ఇవి చూడ్డానికే.. తినటానికి కాదు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)