ప్రెస్ రివ్యూ: వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతున్నారా?

  • 28 నవంబర్ 2017
Image copyright Twitter

1.అజ్ఞాతవాసి కనిపించాడు!

'పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కలిసి తీస్తున్న మూడో సినిమా పేరు ఖరారైంది. ఈ చిత్రానికి 'అజ్ఞాతవాసి' అనే పేరు పెట్టారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మానియేల్‌ కథానాయికలు. 'ప్రిన్స్‌ ఇన్‌ ఎక్సైల్‌' అనేది ఈ సినిమా ఉపశీర్షిక. జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు..' ఈవార్తలను దాదాపు అన్ని తెలుగు పత్రికలూ ఇచ్చాయి.

Image copyright Wiki

2. రైల్వే నిలయంలో ఉద్యోగాల దందా!

రైల్వే, ఎన్టీపీసీల్లో ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ముఠా గురించి ఈనాడు ఒక కథనం ప్రచురించింది. రైల్వే నిలయంలోని సంచాలన భవన్‌ను అడ్డాగా చేసుకుని.. ఉత్తుత్తి ఇంటర్వ్యూలు నిర్వహించి దాదాపు వంద మంది బాధితుల నుంచి రూ.75 లక్షల వరకు వసూలు చేశారని తెలిపింది. ఈ మేరకు రాచకొండ పోలీసులు కేసు నమోదు చేసినట్లు వివరించింది.

Image copyright Telangana CMO

3. ‘కేసీఆర్ సామాజిక న్యాయ దిక్సూచి’

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను నమస్తే తెలంగాణ సామాజిక న్యాయ దిక్సూచిగా అభివర్ణించింది. తెలంగాణ రాష్ర్ట సాధనలో అనుసరించిన వ్యూహాన్నే కేసీఆర్ అనుసరిస్తున్నారని తెలిపింది. సాధ్యమైనంత విస్తృత రాజకీయ ఆమోదాన్ని పొందడం ద్వరా రిజర్వేషన్ల పెంపును సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వెల్లడించింది.

Image copyright Getty Images

4.ఆదిలాబాద్@7డిగ్రీలు

తెలంగాణలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టినట్లు సాక్షి వెల్లడించింది. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా నమోదైనట్లు తెలిపింది.

Image copyright Getty Images

5.తెలంగాణలో ఏపీ విద్యార్థులకు అన్యాయం!

తెలంగాణ ప్రభుత్వ ఉదాసీనత బాసర ట్రిపుల్ ఐటీలోని ఏపీ విద్యార్థులకు శాపంగా మారిందని సాక్షి పేర్కొంది. ఇక్కడ 2000 మంది ఏపీ విద్యార్థులున్నారని.. వీరికి 2016 నుంచి ఉపకార వేతనాలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం లేదని తెలిపింది. ఏపీ ప్రభుత్వం మాత్రం నూజివీడు, ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీల్లో తెలంగాణ విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నట్లు వివరించింది.

Image copyright Getty Images

6. కాంగ్రెస్ గూటికి వరుణ్?

బీజేపీ ఎంపీ మేనకాగాంధీ కుమారుడు వరుణ్ గాంధీ త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశముందని పేర్కొంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది. కాంగ్రెస్ నాయకులను కోట్ చేస్తూ.. ‘అంతర్గత కలహాల వల్ల అత్త ఇందిరతో విభేదించి మేనకా గాంధీ బయటికి పోవడంతో చీలిపోయిన ఈ కుటుంబాలు ప్రియాంక చొరవతో 35 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసే అవకాశముంది.’ అని వివరించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)