ఇవాంకా ట్రంప్ ప్రసంగం : 10 ముఖ్యాంశాలు

  • 28 నవంబర్ 2017
ఇవాంకా ట్రంప్ Image copyright Getty Images

హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ ప్రసంగించారు.

ఆ ప్రసంగంలో హైదరాబాద్ గురించి ఆమె ఏమన్నారంటే..

1) భారత్‌లో ఆవిష్కరణల వేదికగా హైదరాబాద్ వేగంగా ముందుకువెళుతోంది.

2) ఇది ముత్యాల నగరం. దీనికి.. ప్రయత్నాలను విరమించని, ఆకాంక్షల్ని వదిలేయని, నిత్యం మంచి భవిష్యత్ కోసం ప్రయత్నించే.. కలలు కనేవాళ్లు, కొత్త ఆవిష్కరణలు చేపట్టేవారు, పారిశ్రామికవేత్తలు, నాయకులైన మీరే గొప్ప సంపద.

3) మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ ఇదే హైదరాబాదులో స్కూలుకు వెళ్లారు.

Image copyright Getty Images

4) శాస్త్ర సాంకేతికతతో వృద్ధి చెందుతున్న హైదరాబాద్ లాంటి చారిత్రాత్మక నగరానికి రావడం అద్భుతంగా ఉంది.

5) మీ సాంకేతిక వెలుగులన్నీ ప్రపంచ ప్రఖ్యాత హైదరాబాది బిర్యానీ ముందు దిగదుడుపే కావొచ్చు.

Image copyright Getty Images

6) ఇక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే టీ-హబ్ ఉంది. వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న ఇది ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ అవుతుంది.

7) చాయ్‌ అమ్మే స్థాయి నుంచి దేశాన్ని పాలించే స్థాయికి భారత ప్రధాని మోదీ ఎదగడం చాలా గొప్ప విషయం.

8) పురుషాధిక్య పారిశ్రామిక రంగంలో మహిళలు తమను తాము నిరూపించుకోవాలంటే మగవాళ్ల కంటే ఎక్కువ కష్టపడాలి. పారిశ్రామికవేత్తగా ఉన్నప్పుడు దీనిని నేను ప్రత్యక్షంగా చూశాను.

9) మొట్టమొదటిసారి 1500 మంది పారిశ్రామికవేత్తల్లో అత్యధికంగా మహిళలే ఈ సదస్సుకు హాజరుకావటం గర్వంగా ఉంది.

10) ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రజలు 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భూమిపై అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి.

Image copyright Getty Images

మోదీ ఏమన్నారంటే :

  • సైనా నెహ్వాల్, సానియా మీర్జా, పీవీ సింధు వంటి పేరున్న క్రీడాకారిణులంతా ఈ నగరానికి చెందినవారే.
  • ఈ సదస్సు దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటిసారి జరుగుతోంది.
  • మహిళ శక్తికి మారుపేరని భారతీయుల నమ్మకం. మహిళల సాధికారతతోనే అసలైన అభివృద్ధి సాధ్యమని మా నమ్మకం.
Image copyright Getty Images

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)