ఇవాంకా డ్రెస్సును ఎవరు కుట్టారు?

  • 29 నవంబర్ 2017
ఇవాంక Image copyright Getty Images

ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం ధరించిన ఈ గౌను .. ఖరీదు ఎంతో తెలుసా అక్షరాలా ఇరవై రెండు లక్షలు.

ఈ గౌన్ ను లండన్ కి చెందిన ఎర్డెమ్ డిజైన్ చేశారని టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది.

ఈ డ్రెస్సును శీతాకాలపు డిజైన్ లు ఇంగ్లిష్ పూలు, ఒట్టోమన్ సూక్ష్మ కళా రూపాలు, 18 వ శతాబ్దపు సుల్తాన్ల చిత్రాలతో డిజైన్ చేస్తారని ఎర్డెమ్ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

Image copyright Getty Images

కుచ్చిళ్ళ తో కూడిన ఇవాంక గౌన్ను జెనీవా కట్ అవుట్ జాకార్డ్ మిడీగా అభివర్ణించారు.

ఇవాంక వేసుకున్న గౌన్ ను ఇంగ్లీష్ టర్కిష్ సంస్కృతుల నుంచి ప్రభావితం అయి డిజైన్ చేసినట్లు తెలిపారు.

ఇవాంక పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ దుస్తులు, చెప్పులు అంతర్జాతీయ మార్కెట్ లో చెలామణి అవుతున్నాయి.

ఆమె స్వయంగా ఫాషన్ రంగం పారిశ్రామికవేత్త కావడం మరో విశేషం.

Image copyright GETTY

మరోవైపు ఈ డ్రెస్‌పై విమర్శలూ వచ్చాయి.

అంతకు ముందు ఇవాంక హైదరాబాద్‌లో ఏ దుస్తులు వేసుకుంటారన్న అంశంపైనా ఆన్‌లైన్ మీడియాలో చర్చ జరిగింది.

Image copyright Getty Images

సోమవారం ఉదయం ఈమె నల్లటి దుస్తులు.. వాటిపై తెల్లటి ముత్యాలున్న గౌనులో హైదరాబాద్‌కి వచ్చారు.

మంగళవారం ఎర్రటి దుస్తుల్లో కనిపించారు.

ఇవి కూడా చదవండి

ఇవాంకా: హైదరాబాద్ ఐటీ.. బిర్యానీ ముందు దిగదుడుపే!

ఇవాంకా.. ఓసారి మా ఊరు రావా!

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఇవాంకా ట్రంప్ ... వెల్‌కం టు హైదరాబాద్ అంటున్న హైదరాబాదీలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)