్్్

  • 1 డిసెంబర్ 2017

బీబీసీ ఇంటర్వ్యూలో నటుడు ప్రకాశ్ రాజ్‌ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తాను నమ్మిందే చేస్తానని, ఎవర్నో మెప్పించాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.

అయితే, ప్రతీసారి తానే కరెక్ట్ కాదని కూడా ఆయన అన్నారు. టాలీవుడ్‌ నిర్మాతలతో గొడవలకు తన వైఖరి కూడా కారణం అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

న్యాయం దొరికేదాకా, పది మంది నాలా ప్రశ్నించే దాకా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకాశ్ రాజ్ అన్నారు.

తనకు ఏడు భాషలు వచ్చని, అవసరమే వాటిని నేర్చుకునేలా చేసిందని అన్నారు.

విభిన్న పాత్రల్లో మెప్పించే ప్రకాశ్‌ రాజ్, తాను సినిమాలు చూడనని చెప్పారు. ఎన్నో పనులు ఉండగా టైమ్ ఎందుకు పాస్ చేయాలని ప్రశ్నించారాయన.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)