ప్రకాశ్‌రాజ్: చావు నా ఇంటిగుమ్మం దాకా వచ్చింది
- బళ్ల సతీశ్, జయకుమార్ సుదంధిరపాండియన్
- బీబీసీ ప్రతినిధి
ప్రకాశ్‌రాజ్: అన్ని తెలిసీ మౌనంగా ఉంటే చచ్చిపోయినట్టే!
నోట్ల రద్దు ఆశయం మంచిదే కావొచ్చు, కానీ తీసుకొచ్చిన విధానం సరిగా లేదని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు.
కళ్ల ముందు నల్లధనం ఇంకా తిరగాడుతూనే ఉందని ఆయన చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రకాశ్ రాజ్ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
అన్ని విషయాలు తెలిసీ మౌనంగా ఉండే వాళ్లు చచ్చిపోయిన వారితో సమానమని ఆయన అన్నారు. ఎవరు ఏమనుకున్నా, ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రశ్నిస్తూనే ఉంటానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.
పాలకులను కాకుండా మరెవరిని ప్రశ్నిస్తామని ఆయనన్నారు.
ఫొటో సోర్స్, Facebook/Janasenaparty
పవన్ కల్యాణ్ ఆశయాలు, ఆవేదన నాకు తెలుసు!
తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. రాజకీయాలు తనకు ఇష్టం లేదని, ప్రశ్నించడమే ఇష్టమని తెలిపారు.
పవన్ కల్యాణ్ ఆశయాలు, ఆవేదన తనకు తెలుసు అన్నారు. పవన్ తనకు నచ్చాడని ప్రకాశ్ రాజ్ చెప్పారు.
పవన్ కల్యాణ్ పార్టీ విధానాలు నచ్చితే మద్దతిస్తానని ఆయన వివరించారు.
ఒక అభిమానిగా ఓటు వేస్తే, ఆ తర్వాత ప్రశ్నించే నైతిక హక్కు కోల్పోతారని ఆయన అన్నారు.
ప్రకాశ్ రాజ్: పవన్ కల్యాణ్ ఆశయాలు, ఆవేదన నాకు తెలుసు!
తమిళనాడులో కమల్ హసన్ త్వరలో పార్టీ పెట్టబోతున్నారని ప్రకాశ్ రాజ్ చెప్పారు. అయితే, పార్టీ విధానాల గురించి తనతో కమల్ హసన్ ఎలాంటి చర్చలు జరపలేదని వివరించారు. కమల్ పార్టీలో తాను చేరబోనని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఫొటో సోర్స్, STR
'నా ప్రశ్నలకు జవాబు లేదా? లేక దొరికిపోతామనే భయమా?
తప్పులపై ప్రశ్నిస్తే యాంటీ మోదీ ట్యాగ్ తగిలిస్తున్నారని ప్రకాశ్ రాజ్ అన్నారు. ప్రశ్నిస్తే మీకు కంగారెందుకు, బెదిరింపులు ఎందుకు అని ఆయన నిలదీశారు.
'నా ప్రశ్నలకు మీ దగ్గర జవాబు లేదా? లేక దొరికిపోతామనే భయమా?' అని ప్రకాశ్ రాజ్ అడిగారు.
ప్రకాశ్‌రాజ్: నమ్మిందే చేస్తా! కానీ ప్రతీసారి నేనే కరెక్టు కాదు!
నమ్మిందే చేస్తా! ప్రతీసారి నేనే కరెక్టు కాదు!
బీబీసీ ఇంటర్వ్యూలో నటుడు ప్రకాశ్ రాజ్ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తాను నమ్మిందే చేస్తానని, ఎవరినో మెప్పించాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.
అయితే, ప్రతీసారి తానే కరెక్ట్ కాదని కూడా ఆయన చెప్పారు. టాలీవుడ్ నిర్మాతలతో గొడవలకు తన వైఖరి కూడా కారణం అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
న్యాయం దొరికేదాకా..! పది మంది ప్రశ్నించే దాకా!
న్యాయం దొరికేదాకా, పది మంది తనలా ప్రశ్నించే దాకా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకాశ్ రాజ్ అన్నారు.
తనకు ఏడు భాషలు వచ్చని, అవసరమే వాటిని నేర్చుకునేలా చేసిందని వివరించారు.
విభిన్న పాత్రల్లో మెప్పించే ప్రకాశ్ రాజ్, తాను సినిమాలు చూడనని చెప్పారు. ఎన్నో పనులు ఉండగా టైమ్ ఎందుకు పాస్ చేయాలని ప్రశ్నించారాయన.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)