వికలాంగుల విజయ పథం

వికలాంగుల విజయ పథం

సమాజం నుంచి సానుభూతి కోసం చూడకుండా తమిళనాడులోని చెన్నైకి చెందిన వికలాంగుల బృందం స్వశక్తితో ముందుకు వెళుతోంది. "మా ఉలా" (బైక్ టాక్సీ) అనే వినూత్న ఆలోచనతో ఉపాధి బాట పట్టింది.

తమ కార్యక్రమంలో భాగంగా 10 మంది సభ్యుల బృందం క్రీయాశీలకంగా పనిచేస్తోంది. ప్రయాణికుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు యూనిఫాం వేసుకొని బైక్‌లకు నేమ్ ప్లేట్స్ కూడా పెట్టుకుంటారు.

తమ బైక్ టాక్సీకి "మా ఉలా" అనే పేరు పెట్టారు. తమిళంలో "మా ఉలా" అంటే వికలాంగులతో ప్రయాణం అని అర్థం.

ఈ సంస్థను బాలాజీ కుమార్, మొహ్మద్ గడాఫీ స్థాపించారు. ప్రభుత్వ అనుమతి కోసం వారు తీవ్రంగా ప్రయత్నించారు.

'చరిత్ర'లో పీహెచ్‌డీ చేసిన గడాఫీ, కళాశాలలో లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసి ఇటువైపు వచ్చారు. తమ టాక్సీ ఎక్కే ప్రయాణికులకు వీళ్లు హెల్మెట్ కూడా ఇస్తారు.

రహదారి నిబంధనలను తాము కచ్చితంగా పాటిస్తామని వారు అంటున్నారు. కొత్తగా ప్రయత్నిస్తుంటే సవాళ్లు ఎదురుకాకుండా ఉంటాయా? అని బాలాజీ ప్రశ్నిస్తున్నారు. తమ ప్రయత్నం కచ్చితంగా విజయం సాధిస్తుందని అంటున్నారు.

మొదటి 2 కిలోమీటర్లకు రూ.25, తర్వాత ప్రతీ కిలోమీటర్‌కు రూ.10 చార్జీగా నిర్ణయించారు. సహచరులకు, వికలాంగులకు మాత్రం తమ టాక్సీలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)