కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన విరాట్‌ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఆరో డబుల్ సెంచరీ పూర్తిచేశాడు. దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లాలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆయన పరుగుల వరద సృష్టించాడు.

దీంతో కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇంతకుముందు వెస్టిండీస్ ఆటగాడు బ్రియాన్ లారా పేరిట ఈ రికార్డు ఉండేది.

కోహ్లీ కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఆరు డబుల్ సెంచరీలు సాధించాడు. 2016 జులైలో కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీ ఆ ఏడాదిలో మొత్తం మూడుసార్లు 200 మార్కును దాటాడు.

ఈ ఏడాదిలోనూ అదే జోరు చూపిస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో వరుసగా రెండు టెస్టుల్లో ఆయన డబుల్ సెంచరీలు బాదాడు.

ఇంతకుముందు నాగ్‌పుర్‌ టెస్ట్‌లో ద్విశతకం సాధించిన ఆయన తాజాగా దిల్లీలోనూ మరోసారి తన బ్యాటుకు పనిచెప్పాడు.

తాజా ద్విశతకంతో భారత్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌‌ల సరసన చేరాడు.

ప్రస్తుత మ్యాచ్ లైవ్ స్కోర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మా ఇతర కథనాలు: