లండన్: రూ. 400 కోట్లు విలువైన భారతీయుల బంగారాన్ని దోచుకున్న దొంగలు
ఇంగ్లండ్‌లో దొంగలు భారతీయుల్నే లక్ష్యంగా చేసుకున్నారు. అదను చూసి భారతీయుల ఇళ్లలోని బంగారాన్ని కొల్లగొడుతున్నారు. గతేడాది అలా దొంగలు దోచుకున్న బంగారం విలువ దాదాపు రూ.400 కోట్ల రూపాయలు.
ఒక్క మిల్టన్ కీనెస్ అనే పట్టణంలోనే గత రెండు నెలల్లో భారతీయుల ఇళ్లల్లో ఏకంగా 24 చోరీలు జరిగాయి. లెస్టర్, బర్మింగ్‌హామ్, లండన్, మాంచెస్టర్ లాంటి అనేక నగరాల్లో బంగారమే లక్ష్యంగా భారతీయుల ఇళ్లలో చోరీలు జరుగుతూనే ఉంటాయి. ఈ విషయమై పోలీసులు ఎప్పటికప్పుడు భారతీయుల్ని హెచ్చరిస్తూనే ఉంటారు.
గతేడాది లండన్‌లో ఆసియాకు చెందిన వాళ్ల ఇళ్ల నుంచి బంగారం దోచుకెళ్లిన ఘటనల్లో మొత్తం 3463 కేసులు నమోదయ్యాయి. వీటి నుంచి తమని తాము కాపాడుకునేందుకు స్థానిక భారతీయులంతా ఒక్కటవుతున్నారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో దొంగతనాలకు కళ్లెం వేసే ప్రయత్నం చేస్తున్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

వీడియో, బంగారు వర్ణంలో మెరిసిపోతున్న అడవి, వ్యవధి 0,39
సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఆ అడవిలోని వృక్షాలన్నీ బంగారు వర్ణంలోకి మారిపోతాయి. పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ అడవి ఎక్కడుందో తెలుసా?