రాజస్థాన్‌: ‘మంత్రగత్తె’ ముద్రతో మహిళలపై వేధింపులు

రాజస్థాన్‌: ‘మంత్రగత్తె’ ముద్రతో మహిళలపై వేధింపులు

రాజస్థాన్‌లోని అనేక గ్రామాల్లో కొందరు మహిళలపైన మంత్రగత్తె అనే ముద్ర వేయడం సాధారణమైపోయింది. భూవివాదాలూ, ఇతర కారణాల వల్ల తమను లక్ష్యంగా చేసుకున్నారని బాధిత మహిళలు చెబుతున్నారు.

అలా మంత్రగత్తె ముద్ర పడిన వాళ్లలో చదువుకున్నవాళ్లు కూడా ఉన్నారు. మంత్రాలూ, భూతవైద్యం పేరుతో జరిగే కార్యకలాపాలను నిషేధిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం చట్టం చేసినా ఇప్పటికీ అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

గ్రామస్తుల చర్యల కారణంగా చాలామంది మహిళలు ఊరు విడిచి వెళ్లిపోయారు . అలాంటి ముగ్గురు మహిళలతో మాట్లాడి బీబీసీ అందిస్తున్న కథనం.

రిపోర్టింగ్: సుమిరన్ ప్రీత్ కౌర్, షూట్ ఎడిట్: మనిష్ జలుయ్

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)