ఎడారిలో డ్యాములు కడుతున్న బామ్మ

ఎడారిలో డ్యాములు కడుతున్న బామ్మ

ఆమ్లా రుయాను చూస్తే ఏదో మామూలు బామ్మ అనుకుంటారు. కానీ 71 ఏళ్ల వయసున్న ఈ ముంబై బామ్మ ప్రపంచంలో ఎంతో విజయవంతమైన డ్యామ్ నిర్మాతల్లో ఒకరు. భారతదేశంలో కరువు మీద పోరాటంలో ఆమె ముందు వరుసలో ఉన్నారు.

భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్ నీటి కొరత అధికంగా ఉండే రాష్ట్రాల్లో ఒకటి. ఆమ్లా రుయా, ఆమె ఆకార్ చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడే పనిచేస్తున్నాయి. గత పదేళ్లలో వారు 200 పైగా ‘చెక్ డ్యామ్’లు నిర్మించారు. ఫలితంగా 115 పైగా గ్రామాల జీవితాలు, జీవనాధారాలు సమూలంగా మారిపోయాయి. ఇది మరో 193 గ్రామాలపై కూడా సానుకూల ప్రభావం చూపింది.