గుజరాత్ డాంగ్ డ్యామ్‌లు: ప్రమాదంలో 33 గ్రామాలు

గుజరాత్ డాంగ్ డ్యామ్‌లు: ప్రమాదంలో 33 గ్రామాలు

గుజరాత్‌లో వేల ఎకరాల అటవీ ప్రాంతంతో డాంగ్ జిల్లా చూడ ముచ్చటగా ఉంటుంది. కానీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మూడు డ్యామ్‌లతో దాని రూపురేఖలు మారిపోనున్నాయి. ఆదివాసులంతా చెల్లాచెదురయ్యే ప్రమాదంలో ఉన్నారు.

వాళ్ల పరిస్థితులను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తోంది బీబీసీ.

డాంగ్ జిల్లాలో ఆదివాసుల జనాభా ఎక్కువ. తరతరాలుగా వాళ్లు అడవినే నమ్ముకొని జీవిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు డ్యామ్‌ల నిర్మాణం పూర్తయితే 33 గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉందని, 1600 ఆదివాసీ కుటుంబాలు భూమినీ, ఇళ్లనీ కోల్పోయే అవకాశాలున్నాయనీ అంచనా.

రిపోర్టింగ్: వినిత్ ఖరే

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)