గుజరాత్ ఎన్నికలు: మొరాయించిన 111 ఈవీఎంలు

  • 9 డిసెంబర్ 2017
క్యూలైన్లో నిలబడ్డ యువతులు

గుజరాత్‌లో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ శనివారం ముగిసింది.

సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 68శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.

పోలింగ్‌కి సంబంధించిన స్పష్టమైన గణాంకాలు తర్వాత వెల్లడిస్తామని వివరించారు.

Image copyright Getty Images

ఓటింగ్ మొదలవగానే.. సూరత్, కఛ్-సౌరాష్ట్ర జిల్లాల్లో ఈవీఎంలు పనిచేయలేదంటూ ఫిర్యాదులు వచ్చాయి.

సురేంద్రనగర్‌లో 5 ఈవీఎంలు పనిచేయలేదని అధికారులు గుర్తించారు. దీంతో పోలింగ్ ప్రక్రియ మందగించింది.

అదేసమయంలో సూరత్‌ జిల్లాలో కూడా 70 మిషన్లలో లోపాలున్నట్టు స్థానిక రిపోర్టర్ మనీష్ పావియా తెలిపారు.

Image copyright BIPIN TANKARIA

రాజ్‌కోట్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటింగ్ ప్రక్రియను ఓ వ్యక్తి మొబైల్లో వీడియో తీస్తున్న ఘటన వెలుగు చూసింది.

ఈ విషయంపై దర్యాప్తు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు.

ఈవీఎం మిషన్లపై ఫిర్యాదులు రాగానే వాటి స్థానంలో కొత్త మిషన్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఓటింగ్ ప్రక్రియ సజావుగానే కొనసాగుతోంది.

Image copyright KIRITSINH ZALA

మొదటి విడతలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

గుజరాత్ ముఖ్యమంత్రి రూపానీ, భారత క్రికెటర్ పుజారా మొదలైన వ్యక్తులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు

పెళ్లి వేడుకలో డాన్స్ మధ్యలో ఆపినందుకు యువతి ముఖంపై తుపాకీతో కాల్చారు

ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...

నిందితులను చంపేస్తే ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు

BBC Exclusive: ఎయిర్‌టెల్ సమాచార వ్యవస్థలో లోపం.. 32 కోట్ల మంది సమాచారం లీకయ్యే ప్రమాదాన్ని సరిదిద్దామన్న సంస్థ

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: మహబూబ్ నగర్‌ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు

ఉన్నావ్ అత్యాచారం: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి

హైదరాబాద్ అత్యాచారం, ఎన్‌కౌంటర్: "మనం కోరుకునే న్యాయం ఇది కాదు"