కమెడియన్ విజయ్ ఆత్మహత్యకు కారణమేంటి?

  • 11 డిసెంబర్ 2017
విజయ్ Image copyright YOUTUBE

టాలీవుడ్‌ కమెడియన్ విజయ్ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని నివాసంలో బలన్మరణానికి పాల్పడ్డారు.

అయితే, "నా కుమారుడి మృతికి నా కోడలే(వనిత) కారణం. సినిమాలు కాదు. డబ్బు, బంగారంతో కోడలు ఇంటి నుంచి వెళ్లిపోయింది" అని విజయ్ తల్లి విజయలక్ష్మి మీడియాతో అన్నారు.

విజయ్‌ది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Image copyright YOUTUBE

విజయ్‌కి ఐదేళ్ల కింద వనితతో వివాహం జరిగినట్లు అతని స్నేహితులు తెలిపారు.

'అమ్మాయిలు అబ్బాయిలు', 'బొమ్మరిల్లు' సినిమాలతో కమెడియన్‌గా విజయ్ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించారు.

‘బెదిరింపులతోనే ఆత్మహత్య’

విజయ్ ఆత్మహత్యపై విచారణ చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో విజయ్ భార్య వనిత, శశిధర్, అడ్వకేట్ శ్రీనివాస్‌లపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

‘‘విజయ్‌కు అతని భార్య వనితతో గత నాలుగు సంవత్సరాలుగా మనస్పర్థలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ సెల్ఫీ వీడియోలో శశిధర్, అడ్వొకేట్ పేర్లు ఉన్నాయి. శశిధర్, అడ్వకేట్ బెదిరింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడంటూ వీడియో రికార్డ్ ఉంది. కానీ, ఈ సెల్ఫీ వీడియోలో ఆడియో సరిగ్గా వినిపించడం లేదు. స్పష్టత కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం. కేసు విచారణలో ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర రావు చెప్పారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు