బాహుబలి 2 మరో రికార్డు

  • 13 డిసెంబర్ 2017
బాహుబలి Image copyright facebook

బాహుబలి 2 మరో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది దేశంలో ఎక్కువ మంది గూగుల్‌లో వెతికిన అంశంగా ఇది నిలిచింది.

ప్రపంచ వ్యాప్త ట్రెండ్స్‌ను పరిశీలిస్తే సినిమా విభాగంలో ఇది 7వ స్థానంలో నిలిచింది.

సినిమా విభాగంలో భారత్‌ ర్యాంకింగ్స్‌లో బాహుబలి తర్వాత దంగల్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, బద్రినాథ్ కి దుల్హనియా, మున్నా మైఖేల్ ఉన్నాయి.

గ్లోబల్ ట్రెండ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే. సినిమా విభాగంలో.. ఐటీ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో వండర్ ఉమెన్, మూడో స్థానంలో బ్యూటీ అండ్ ది బీస్ట్ ఉన్నాయి.

లోగన్ నాలుగు, జస్టిస్ లీగ్ అయిదు, ఫేట్ ఆఫ్ ద ఫ్యూరియస్ ఆరో స్థానంలో నిలిచాయి.

బాహుబలి 2 ఏడో స్థానంలో నిలవగా.. డన్‌కర్క్ ఎనిమిది, తర్వాత లాలా ల్యాండ్, పదో స్థానంలో థోర్:రాగ్నోరోక్ ఉన్నాయి.

భారత్‌లో ఎంటెర్‌టైనర్స్ కేటగిరీలో రానా దగ్గుబాటి పదో స్థానంలో నిలిచారు.

Image copyright Getty Images

కోడి కూర ఎలా వండాలి?

గ్లోబల్ విభాగంలో కోడికూర ఎలా వండాలి అనే ప్రశ్న కూడా ‘ఎలా చేయాలన్న’ విభాగంలో టాప్‌లో నిలిచింది.

గ్లోబల్ విభాగంలో టాప్ సెర్చ్‌లు: 1.హరికేన్ ఇర్మ 2. ఐఫోన్8 3.ఐఫోన్‌ ఎక్స్ 4.మట్ లార్ 5.మేఘన్ మార్కల్

వ్యక్తులు: 1.మాట్ లార్, 2.మేఘన్ మార్కల్ 3.నదియా తోఫా 4.హార్వే వైన్‌స్టీన్, 5.కెవిన్ స్పేసీ

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హరికేన్ ఇర్మా ధాటికి సర్వం కోల్పోయి..

వార్తలు: 1.హరికేన్ ఇర్మా 2.బిట్‌కాయిన్ 3.లాస్ వెగాస్ షూటింగ్ 4.ఉత్తర కొరియా 5.సూర్య గ్రహణం

ఎన్నికలు: 1.ఫ్రెంచ్ ఎన్నికలు 2. జర్మన్ ఫెడరల్ ఎన్నికలు 3. బ్రిటన్ ఎన్నికలు 4.ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు 5.జార్జియా ప్రత్యేక ఎన్నికలు

వంటలు: 1.చికెన్ బ్రెస్ట్ రెసిపీ 2.గ్రౌండ్ బీఫ్ రెసిపి 3.టర్కిష్ బ్రెడ్ రెసిపి 4.ఫ్రెంచ్ టోస్ట్ రెసిపి 5.కెక్ తారిఫి

భారత్‌లో ప్రధాన సెర్చ్‌లు

సాధారణ సెర్చ్‌లు: 1.బాహుబలి2 2.ఐపీఎల్ 3.లైవ్ క్రికెట్ స్కోర్ 4.దంగల్ 5.హాఫ్ గర్ల్ ఫ్రెండ్

ఎలా చేయాలి కేటగిరీలో ఆధార్ నుంచి పాన్ కార్డుకు ఎలా అనుసంధానించాలన్నది టాప్‌లో నిలిచింది.

Image copyright Getty Images

ఎంటర్‌టైనర్స్ విభాగంలో 1.సన్నీలియోని 2.అర్షి ఖాన్ 3.సప్నా చౌదరి 4.విద్యా వోక్స్ 5.దిశా పఠాని మొదటి అయిదు స్థానాల్లో ఉన్నారు.

‘వాట్ ఈజ్’.. విభాగంలో జీఎస్టీ మొదటి బిట్కాయిన్ రెండు జల్లికట్టు మూడో స్థానంలో నిలిచాయి.

ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం