గుజరాత్ - హిమాచల్ ఎగ్జిట్ పోల్స్

  • 14 డిసెంబర్ 2017
MODI RAHUL Image copyright Getty Images

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది. రెండో విడతగా గురువారం 14 జిల్లాల్లో 93 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.

మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.

ఈ నెల 18న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక్కడ అధికారం దక్కాలంటే 92 సీట్లలో గెలవాలి.

తొలి విడత 89 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అక్కడ 68 శాతం ఓటింగ్ నమోదైంది.

మొత్తానికి గుజరాత్ ఎన్నికలకు సంబంధించి.. బీజేపీ‌కే ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

ఒక్క ఏబీపీ తప్ప తక్కినవన్నీ బీజేపీకి 100కు పైగా సీట్లు వస్తాయని వివరించాయి.

ఇక హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్ ఏం చెప్పాయో చూడండి.

హిమాచల్ ప్రదేశ్‌లో్నూ బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.

ఇక్కడ మెజారిటీకి 35 సీట్లు అవసరం.

అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 40కిపైగా సీట్లు వస్తాయని తెలిపాయి.

ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)