రీటా: 57వ పుట్టిన రోజు జరుపుకొన్న చింపాంజీ

  • 15 డిసెంబర్ 2017
రీటా కట్ ఔట్

హ్యాపీ బర్త్ డే రీటా!

రీటా ఎవరనుకుంటున్నారా..?

రీటా ఓ ఆడ చింపాంజీ. ఈ రోజు పుట్టిన రోజు. దానికా ప్రత్యేకత ఏమిటంటారా?

సాధారణంగా చింపాంజీలు 40 ఏళ్లు జీవిస్తాయి. మరి మన రీటా ఇప్పుడు 57వ పుట్టిన రోజు జరుపుకుంటోంది.

Image copyright National Zoological Park

ఎప్పుడు పుట్టింది?

1960 డిసెంబరు 15న నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డా‌మ్‌లో జన్మించింది.

1964 ఫిబ్రవరి 27న భారత్‌లోని దిల్లీ జూకు తీసుకొచ్చారు. వాళ్లు రీటాను ఊరికే ఇవ్వలేదులేండి. బదులుగా మన దేశీయ కొంగలను తీసుకున్నారు.

ఒక రోజు ముందే

రీటా పుట్టిన రోజు డిసెంబరు 15న అంటే శుక్రవారం. ఆ రోజున దిల్లీ జూకు సెలవు.

అందువల్ల ఒక రోజు ముందుగా గురువారం నాడు రీటా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.

బోను బయట రీటా కట్ ఔట్ ఉంచి, దానికి దండ వేశారు.

ఫుట్ బాల్ బహుమతి

రీటా పుట్టిన రోజు సందర్భంగా కేకు కోశారు. ఫుట్ బాల్, ఆట బొమ్మలు బహుమతిగా ఇచ్చినట్లు దిల్లీ జూ డైరెక్టర్ రేణు సింగ్ బీబీసీకి చెప్పారు.

కొత్త దుప్పటి కూడా ఇచ్చినట్లు చెప్పారు. రీటా ఈ దుప్పటితో ఆనందంగా ఆడుకున్నట్లు తెలిపారు.

విద్యార్థుల శుభాకాంక్షలు

రీటా పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. శుభాకాంక్షలు తెలిపారు.

మరింత కాలం ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.

చిత్రం శీర్షిక రీటాతో పాటు ఖ్యాతి కూడా తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంది

నేను కూడా పుట్టింది ఈ రోజే

ఖ్యాతి అనే విద్యార్థి తన పుట్టిన రోజు వేడుకలను జూలో జరుపుకొంది.

రీటాతో కలిసి బర్త్ డే వేడుకలు చేసుకోవడంపై ఖ్యాతి ఆనందం వ్యక్తం చేసింది.

"ఒక వేళ రీటాను కలిసే అవకాశం వస్తే నేడు నా పుట్టిన రోజు అని చెబుతా" అని ఖ్యాతి బీబీసీతో చెప్పింది.

పాపం పిల్లలు

మగ చింపాంజీ మ్యాక్స్, రీటాలకు నాలుగు చిన్ని చింపాజీలు పుట్టాయి. కానీ అవి ఎక్కువ కాలం బతక లేదు.

సంతాన ఉత్పత్తి కోసం కొన్ని రోజుల పాటు రీటాను 1985లో పంజాబ్‌లోని చత్‌బీర్ జూకు పంపించారు. అయినా కూడా ఫలితం లేదు.

తిరిగి 2006లో మళ్లీ దిల్లీ జూకి రీటా వచ్చింది.

చిత్రం శీర్షిక రీటా పుట్టిన రోజు సందర్భంగా పిల్లలకు కేకులు పంచారు

అరటి పండ్లు అంటే ఎంతో ఇష్టం

రీటాకు ఇష్టమైన ఆహారమేమిటో తెలుసా..? అరటి పండ్లు.

పుట్టిన రోజున జూ సిబ్బంది ప్రేమగా అరటి పండ్లు తినిపించారు.

కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టారు. పుట్టిన రోజు నాడు ప్రత్యేక ఆహారాన్నితినే ఆనందంలో రీటా బోను నుంచి బయటకే రాలేదు.

బోను బయట ఏర్పాటు చేసిన డిజిటల్ తెరపై రీటాను అందరూ వీక్షించారు.

చిత్రం శీర్షిక రీటా ఎంతో స్నేహంగా ఉండేదని దిల్లీ జూ డైరెక్టర్ రేణు సింగ్ తెలిపారు

గుడ్ గర్ల్

రీటా ఎంతో మంచి చింపాంజీ అని రేణు సింగ్ తెలిపారు. ఎంత స్నేహంగా ఉండేదని, అచ్చం అమ్మాయిలానే ప్రవర్తించేదని వివరించారు.

మరింత కాలం రీటా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు