దిల్లీ నిర్భయ ఘటనకు నేటితో ఐదేళ్లు!

దిల్లీ నిర్భయ ఘటనకు నేటితో ఐదేళ్లు!

వీడియో: దివ్య ఆర్య/కషిఫ్

2012 డిసెంబర్ 16. దేశ రాజధానిలో కదులుతున్న బస్సులో 23ఏళ్ల యువతిపై ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

తోడుగా వచ్చిన స్నేహితుడిని కొట్టి, యువతిపై దుర్మార్గానికి ఒడిగట్టిన తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

తీవ్రంగా గాయపడిన నిర్భయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.

నిర్భయ ఘటన జరిగి నేటికి ఐదేళ్లు. మరి దిల్లీలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మహిళల భద్రతకు అభయం ఉందా? ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి దిల్లీకి వచ్చిన యువతులు ఏం చెబుతున్నారు? దిల్లీ క్రైమ్ కేపిటలా? పరిస్థితి మార్పేమైనా వచ్చిందా?

ఈ విషయం తెలుసుకునేందుకు బీబీసీ ఓ చిన్న ప్రయత్నం చేసింది. కొందరు మహిళలతో మాట్లాడి వారి మనోభావాలేమిటో తెలుసుకుంది. ఇంతకీ వారేం చెప్పారు. ఈ వీడియోలో చూడండి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)