సెన్సెక్ ఢమాల్.. 700 పాయింట్ల నష్టం!

  • 18 డిసెంబర్ 2017
స్టాక్ మార్కెట్ Image copyright INDRANIL MUKHERJEE

సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే సెన్సెక్స్ భారీగా పడిపోయింది.

దాదాపు 700 పాయింట్లు నష్టపోయింది. గుజరాత్ ఫలితాల సరళితో.. మార్కెట్‌లో భారీ ఒడుదొడుకులు చోటు చేసుకున్నాయి.

గుజరాత్.. హిమాచల్ ఎన్నికల కౌంటింగ్‌ మొదలైంది. గుజరాత్‌లో కౌంటింగ్ హోరాహోరీగా జరుగుతోంది.

ఒక్కో రౌండ్ ముగిసే కొద్దీ విజయం.. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య దోబూచులాడుతోంది.

ఇక్కడ విజయానికి 92 సీట్లు అవసరం కాగా.. హిమాచల్ ప్రదేశ్‌లో విజయానికి 35 సీట్లు సాధించాలి.

ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ప్రారంభంలో దాదాపు 700 పాయింట్లు, నిఫ్టీ 220 పాయింట్లు నష్టపోయాయి. ఆ తర్వాత కొంత కోలుకున్నాయి.

తాజా సమాచారం మేరకు.. గుజరాత్‌లో బీజేపీ 87 కాంగ్రెస్ 90 , ఇతరులు 2 చోట్ల లీడ్ లో ఉన్నాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 13, సీపీఎం 1, కాంగ్రెస్ 13 చోట్ల లీడ్‌లో ఉన్నాయి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)