గుజరాత్‌లోని సూరత్‌లో బీజేపీ కార్యకర్తల సంబరాలు

గుజరాత్‌లోని సూరత్‌లో బీజేపీ కార్యకర్తల సంబరాలు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ పరిణామం పార్టీ కార్యకర్తల్లో ఆనందాన్ని నింపింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలోని పలు ప్రాంతాలలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

బీజేపీ ప్రధాన కార్యాలయాలు కార్యకర్తల కోలాహలంతో కిటకిటలాడి పోయాయి. టపాసులు కాల్చుతూ ధూంధాం చేసుకున్నారు.

ఉత్సాహంగా డప్పులు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ కాలు కదిపారు. ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)