టీ20 క్రికెట్: రోహిత్ ఫాస్టెస్ట్ సెంచరీ.. భారీ ఆధిక్యంతో భారత్ విజయం

  • 22 డిసెంబర్ 2017
రోహిత్ శర్మ Image copyright Reuters

క్రికెట్ మైదానంలో రోహిత్ శర్మ దూకుడు కొనసాగుతోంది. శ్రీలంకతో శుక్రవారం రాత్రి ఇండోర్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. టీ20 క్రికెట్‌లో భారత ఆటగాడు చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్‌తో కలసి సంయుక్తంగా రికార్డులకెక్కాడు. ఇదే ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ కూడా 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మొత్తం 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఇందులో 10 సిక్స్‌లు, 12 ఫోర్లు ఉన్నాయి. భారత ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లోనే రోహిత్ తన శతకాన్ని పూర్తి చేయటం గమనార్హం.

అనంతరం డబుల్ సెంచరీ దిశగా దూసుకెళుతున్నట్లు కనిపించిన రోహిత్ శర్మ వరుసగా.. సిక్స్‌, ఫోర్, సిక్స్ కొట్టి తర్వాత ఔటై పెవిలియన్ చేరాడు.

Image copyright AFP

రోహిత్ శర్మకు తోడు ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన కేఎల్ రాహుల్ సైతం వేగంగా ఆడాడు. 49 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి.

వీరిద్దరి బ్యాటింగ్ ప్రతిభతో భారత జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 260 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

261 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 17.2 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 88 పరుగుల భారీ తేడాతో మ్యాచ్‌ను గెలిచిన భారత జట్టు మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. చివరి టీ20 ఆదివారం ముంబైలో జరుగనుంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

#BBCSpecial: బీదర్‌లో అసలేం జరిగిందంటే.. "గ‌డ్డి కోసే కొడ‌వ‌ళ్లు, క‌ర్ర‌లు, రాళ్లు పట్టుకుని దాదాపు 80 మంది వ‌చ్చారు"

బ్రిటన్: పార్లమెంటు సభ్యులకు ‘కొత్త ప్రవర్తనా నియమావళి’.. ఎంపీల సభ్యత్వం రద్దుకు ప్రతిపాదన

చైనా బాహుబలి: వారం రోజులు కూడా ఆడని భారీ బడ్జెట్ సినిమా ‘అసుర’

స్వామి అగ్నివేశ్‌పై దాడి: బీజేవైఎం కార్యకర్తలే కొట్టారని ఆరోపణ

ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?

సిరియా: శరణార్థుల్ని చేరుకోని సాయం.. సహాయక సంస్థల్ని దేశంలో అడుగుపెట్టనివ్వని ప్రభుత్వం

చేపలు తినొచ్చా.. తినకూడదా? ఈ రసాయనాల గొడవేంటి?

పాకిస్తాన్: సాధారణ ఎన్నికల బరిలో హిందువులు, దళితులు