క్రికెట్: ‘డబుల్ సెంచరీల వీరుడు’ రోహిత్ రహస్యమేంటి?

  • 23 డిసెంబర్ 2017
రోహిత్ శర్మ Image copyright AFP

మొన్న డబుల్ సెంచరీ.. నిన్న టీ 20ల్లో వేగవంతమైన సెంచరీ.. ఇలా భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ రోజు రోజుకూ చెలరేగిపోతున్నారు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఇతను టీ 20ల్లోనూ అదే స్థాయిలో రెచ్చిపోతున్నాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ 20లోనూ 42 బంతుల్లో 56 పరుగులు చేసి.. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మరి రోహిత్ బాదుడు వెనుక రహస్యమేంటి?

2015 లో దక్షిణాప్రికాలో జరిగిన వన్డే సిరీస్‌లో పరాజయం పొందిన భారత్, ఆ తర్వాత ఒక్క సిరీస్‌నూ చేజార్చుకోలేదు.

ఇటీవల రెండో వన్డేలో లంకను మట్టికరిపించడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మది కీలక పాత్ర. వన్డే కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు.

ఆ వెంటనే ఇండోర్‌లో జరిగిన టీ 20లో 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి.. మరోసారి తన సత్తా ఏంటో నిరూపించాడు.

Image copyright Getty Images

అసలు రో'హిట్రహస్యమేంటి?

ఒకప్పుడు సునీల్ గవాస్కర్.. ఆయన తర్వాత సచిన్ తెందుల్కర్.. విరాట్ కోహ్లీ.. అలాగే టీమిండియాకు దొరికిన మరో స్టార్ రోహిత్.

గవాస్కర్ కాలంలో గుండప్ప విశ్వనాథ్ ఫ్లిక్ షాట్‌లకు పెట్టింది పేరు. విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వన్డేల్లో రోహిత్ కూడా లాంగ్ ఇన్నింగ్స్‌.. షార్ట్ ఇన్నింగ్స్‌ ఫార్మట్ ఏదైనా సత్తా చాటుతున్నాడు.

అంతర్జాతీయ వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిటే ఉంది. 2014లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డు నమోదు చేశాడు.

అంతకు ముందు 2013 నవంబర్ 2న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 209 పరుగులు చేశాడు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సునీల్ గవాస్కర్

రోహిత్ కాకుండా వన్డేల్లో ద్విశతకాలు సాధించిన భారత ఆటగాళ్లు సచిన్ తెందుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్.

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ నమోదైంది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ పేరిటే. 2010 ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ సరిగ్గా 200 పరుగులు చేశాడు.

ఆ తర్వాత 2011లో వెస్టిండీస్‌తో జరిగిన పోరులో వీరేంద్ర సెహ్వాగ్ 219 పరుగుల చేసి ఔరా! అనిపించాడు.

Image copyright NOAH SEELAM/AFP/Getty Images

'నాకంత పవర్ లేదు'

ఇంత లాంగ్ ఇన్నింగ్స్‌ ఎలా ఆడగలుగుతున్నారు? ఈ క్రికెటర్ల ఆట వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అన్నది చాలా మంది మెదళ్లను తొలిచే ప్రశ్న.

ఇటీవల మొహాలీ వేదికగా మూడో ద్విశతకం సాధించిన సందర్భంగా రోహిత్ ఇలా సమాధానం చెప్పాడు.

"ప్రారంభంలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అందువల్ల నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకోవాలనుకున్నా. నేను ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వాడినేమీ కాదు. నాకు అంత పవర్ లేదు."

Image copyright Getty Images

"ఫీల్డ్‌లో పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం అనుసరించేందుకు కొంచెం బుర్ర ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆట కోసం నా శక్తి మేరకు ప్రయత్నిస్తుంటాను" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 153 బంతుల్లో 208 పరుగులు చేశాడు.

వరుసగా సిక్సర్లు బాదుతూ 40 ఓవర్ల తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌లోనే 13 ఫోర్లు, 12 సిక్సులు కొట్టాడు.

Image copyright Getty Images

ఫోర్లు, సిక్సులు అలా బాదడం సులువైన పనేమీ కాదని అన్నారు రోహిత్.

"సిక్సులు కొట్టడం అంత సులువేమీ కాదు. ఎంతో ప్రాక్టీస్, హార్డ్ వర్క్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. క్రికెట్‌లో ఏదీ సులువు కాదు. టీవీలో చూస్తుంటే అది సులువుగానే కనిపించొచ్చు!"

40వ ఓవర్‌లో రోహిత్ శతకం పూర్తి చేశాడు. 50వ ఓవర్‌లో డబుల్ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అందులో మొదటి సెంచరీ 115 బంతుల్లో పూర్తి చేయగా.. రెండో శతకాన్ని కేవలం 36 బంతుల్లోనే సాధించాడు. ఈ నంబర్లతో రోహిత్‌ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

Image copyright NOAH SEELAM/AFP/Getty Images

వంద దాటితే ఆగడు!

రోహిత్ తన పదేళ్ల కెరీర్‌లో 16 శతకాలు సాధించాడు. అందులో మూడింటిని 200 మార్కును దాటించాడు.

ఈ డబుల్ సెంచరీలే కాకుండా, గతంలో 171, 150, 147 పరుగులు కూడా చేశాడు. దీన్ని బట్టి చూస్తే 100 పరుగుల మార్కును చేరుకున్న తర్వాత, రోహిత్ అంత సులువుగా క్రీజు నుంచి బయటకొచ్చే రకం కాదని అర్థం చేసుకోవచ్చు.

పరుగుల వేగంలో సచిన్, కోహ్లీ, ధోనీల బాటలోనే రోహిత్ వెళ్తున్నాడని చెప్పుకోవచ్చు.

ఏ బంతిని షాట్ కొట్టాలి? ఏ వైపున బౌండరీ దాటించాలి? అని ఆలోచించడంలో రోహిత్ దిట్ట. అసాధ్యమనుకునే షాట్‌తోనూ సులువుగా సిక్స్‌లు ఖాతాలో వేసుకుంటాడు.

Image copyright Getty Images

200 గురించి ఆలోచించలేదు

టీ 20లోనూ అదే దూకుడు కొనసాగించాడు. ''పరిస్థితులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఎప్పటిలా బంతిని లైన్‌లో ఆడేందుకే ప్రయత్నించా. విజయవంతమయ్యాను.’’ అని రోహిత్ వివరించాడు.

ఇండోర్‌లో బ్యాటింగ్‌ను ఆస్వాదించానని తెలిపాడు.

సెంచరీ పూర్తయ్యాక 200 గురించి అస్సలు ఆలోచించలేదని వివరించాడు. ఆలోచిస్తే అది అత్యాశే అవుతుందని తెలిపాడు.

ఈ పిచ్‌పై ఎంత భారీ స్కోరైనా నిలవడం కష్టం కనుక వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడంపైనే దృష్టిసారించాను'' అని పేర్కొన్నాడు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి: 'ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా'

నిర్భయ దోషులను చివరి కోరిక అడిగిన తీహార్ జైలు అధికారులు

బాంబే డక్: ‘భారతదేశ చేపల్లో అద్భుతమైన చేప’

‘అన్ని రకాల క్యాన్సర్లకూ చికిత్స చేసే టెక్నిక్‌’

'ఇంగ్లిష్ మీడియం బిల్లు'కు రెండోసారి ఏపీ అసెంబ్లీ ఆమోదం.. ఇప్పుడు మండలిలో ఏం జరుగుతుంది..

కరోనా వైరస్‌: చైనాలో మరో నగరానికి రాకపోకలు నిలిపివేత

‘రోహింజ్యాలపై మారణహోమం ఆపేందుకు చర్యలు తీసుకోండి’- మయన్మార్‌కు ఐసీజే ఆదేశం

ఆంధ్రప్రదేశ్: శాసన మండలిలో అసలేం జరిగింది? సెలెక్ట్ కమిటీ ఏం చేస్తుంది

చనిపోయిన వ్యక్తి నుంచి వీర్యం సేకరించి పిల్లలు పుట్టించొచ్చా