T20 సిరీస్: శ్రీలంకపై భారత్ క్లీన్ స్వీప్

  • 24 డిసెంబర్ 2017
ధోనీ, హార్దిక్ పాండ్యా Image copyright Reuters

ఆదివారం ముంబయిలో జరిగిన మూడో, ఆఖరు టీ-20 క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు శ్రీలంక జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది.

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు భారత్‌కు 136 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

మొత్తం సిరీస్‌లో శ్రీలంక ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది.

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు.

భారత బౌలర్లు శ్రీలంక జట్టును 20 ఓవర్లలో 135 పరుగులకే కట్టడి చేయగలిగారు.

36 పరుగులు సాధించిన డీ గుణరత్నే శ్రీలంక జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచారు.

భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, జయదేవ్ ఉనాద్కట్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్‌లకు ఒక్కో వికెట్ లభించింది.

భారత జట్టులో రెండు మార్పులు చేశారు. జస్‌ప్రీత్ బుమ్రా, యుజవేంద్ర చహల్‌ల స్థానంలో ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్, పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌లకు చోటిచ్చారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు