డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్

వాట్సాప్ లోగో

ఫొటో సోర్స్, Getty Images

డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి కొన్ని ఫోన్లకు వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు వాట్సాప్ తన అధికారిక బ్లాగ్‌లో పేర్కొంది.

బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ 10, విండోస్ 8 మొదలైన పాత ఆపరేటింగ్ సిస్టంలు ఉన్న ఫోన్లకు డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి సేవలను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ తన బ్లాగ్‌లో వివరించింది.

దాంతో ఈ ఆపరేటింగ్ సిస్టం ఉన్న ఫోన్లను వినియోగిస్తున్న వాళ్లు, వాట్సాప్ సేవలు కావాలనుకుంటే మరింత ఆధునిక ఓఎస్‌లు ఉన్న ఫోన్లకు మారక తప్పదు.

నిజానికి ఈ ఏడాది జూన్‌లోనే ఈ రెండు ఓఎస్‌లకూ సేవల్ని నిలిపేస్తామని వాట్సాప్ ప్రకటించినా, దాన్ని ఏడాది చివరి దాకా పొడిగించింది.

సంస్థ బ్లాగ్‌లో ప్రకటించిన తేదీల ప్రకారం ఇకపై ఆ గడువుకు పొడిగింపు లేనట్లే.

ఫొటో సోర్స్, Getty Images

‘వాట్సాప్‌ను ప్రవేశ పెట్టిన కొత్తల్లో డెబ్భై శాతం ఫోన్లు బ్లాక్ బెర్రీ, నోకియా సంస్థలు విడుదల చేసే ఓఎస్‌ల పైనే ఆధారపడి పనిచేసేవి. కానీ ప్రస్తుతం 99.5 శాతం ఫోన్లలో గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ సంస్థల నుంచి వచ్చిన ఓఎస్‌లే ఉన్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు’ అంటూ వాట్సాప్ తన బ్లాగ్‌లో వివరించింది.

సంస్థ బ్లాగ్ ప్రకారం ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో వాట్సాప్ సేవలకు తుది గడువు:

  • బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ 10 - డిసెంబర్ 31,2017
  • విండోస్ ఫోన్ 8.0, అంతకంటే పాతవి - డిసెంబర్ 31, 2017
  • నోకియా ఎస్40 - డిసెంబర్ 31, 2018
  • ఆండ్రాయిడ్ 2.3.7, అంతకంటే పాతవి - ఫిబ్రవరి 1, 2020

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)