ముంబయిలో అగ్ని ప్రమాదం, కనీసం 15 మంది మృతి

  • 29 డిసెంబర్ 2017
భవనం పై అంతస్తులో ఉన్న పబ్‌లో అగ్నిప్రమాదం Image copyright AMOL RODE/BBC MARATHI
చిత్రం శీర్షిక భవనం పై అంతస్తులో ఉన్న పబ్‌లో అగ్నిప్రమాదం

ముంబయిలో అర్ధరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. లోయర్ పరేల్ ప్రాంతంలోని కమలా మిల్స్ వాణిజ్య భవన సముదాయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. పలువురుగా గాయపడ్డారు.

భవనం పై ఉన్న '1 ఎబో' రెస్టారెంట్‌లో మంటలు ప్రారంభమయ్యాయని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

చిత్రం శీర్షిక కమలా మిల్స్

అగ్నిప్రమాదం చోటుచేసుకున్న భవన సముదాయంలో పలు మీడియా సంస్థల కార్యాలయాలు, హోటళ్లు ఉన్నాయి.

ఈ ఘటన రాత్రి 12.30కి చోటుచేసుకుందని, పది నిమిషాల తర్వాత ఆరు ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయని బీబీసీ మరాఠీ ప్రతినిధి జాహ్నవి మూలే తెలిపారు.

క్షతగాత్రులను సమీపంలోని హిందూజా, కేఈఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Image copyright AMOL RODE/BBC MARATHI

తృటిలో తప్పించుకున్న బీబీసీ గుజరాతీ ఎడిటర్

మంటలు అంటుకునే సమయంలో బీబీసీ గుజరాతీ ఎడిటర్ అంకుర్ జైన్ '1 ఎబో' రెస్టారెంట్‌లోనే ఉన్నారు. ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోగలిగారో ఆయన మాటల్లోనే..

"సాయంత్రం చాలా సరదాగా గడిపాము. కానీ, అదే రాత్రి భయానకంగా మారింది. మంటలు అంటుకునేటప్పుడు నాతోపాటు, మా చెల్లి, స్నేహితులు అంతా '1 ఎబో' రెస్టారెంట్‌లోనే ఉన్నాం. మంటలు వస్తున్నాయంటూ ఒక్కసారిగా పెద్దగా అరుపులు వినిపించాయి. దాంతో కొన్ని సెకన్లకే తొక్కిసలాట జరిదింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే రెస్టారెంట్ మొత్తం మంటలు వ్యాపించాయి. బయటకు వెళ్లాల్సిన అత్యవసర ద్వారాన్ని ముందుగా అగ్నికీలలు కమ్మేశాయి. మేము వెంటనే ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాము. కానీ, చాలా మంది బయటకు రాలేకపోయారు. మేము కిందకు పరుగులు పెడుతున్నప్పుడు పైన రెస్టారెంట్‌లో పేలుడు శబ్దాలు వినిపించాయి. కమలా మిల్స్ భవన సముదాయంలో పలు ప్రముఖ రెస్టారెంట్లు ఉన్నాయి. కానీ, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎదుర్కొనేందుకు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు"

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు