అంతా పార్టీ మూడ్‌లో ఉంటే.. రజనీ పార్టీ ప్రకటన చేశారు

  • 31 డిసెంబర్ 2017
రజనీ Image copyright Getty Images

రాజకీయాల్లోకి వస్తా.. సొంతంగా పార్టీ పెడతా అంటూ తమిళ నటుడు రజనీకాంత్ ప్రకటించడంపై సోషల్ మీడియాలో పలువురు స్పందించారు.

రజనీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కొందరు శుభాకాంక్షలు చెబితే.. మరికొందరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఓ నెటిజన్ అయితే.. తమిళనాడుకు కూడా ఓ 'పవన్' కల్యాణ్ దొరికారు అంటూ వ్యాఖ్యానించారు.

ఇలా సోషల్ మీడియాలో కొందరు చేసిన కామెంట్లను చూద్దాం...

నా మిత్రుడు, మానవతావాది రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆయనకు నా శుభాకాంక్షలు. అని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు.

Image copyright Twitter

నా సోదరుడు రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం చేస్తున్నందుకు ఆయనకు నా అభినందనలు అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

సాధారణ ప్రజలు అంతా డిసెంబర్ 31న 'పార్టీ'లకు వెళ్తుంటారు. రజనీ కాంత్ పార్టీని ప్రారంభిస్తున్నారు. అంటూ చాలా మంది ట్వీట్ చేశారు.

రజనీకాంత్ తమిళనాడుకు ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటూ కృష్ణ పలేశ్ వ్యాఖ్యానించారు.

నా మంచి స్నేహితుడు రజనీకాంత్‌కు శుభాకాంక్షలు అంటూ టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు.

Image copyright Twitter

వీళ్లకూ ఓ పవన్ దొరికారు. ప్రజలు జయలలిత తర్వాత నాయకత్వ లక్షణాలు రజనీకాంత్‌లో వెతుక్కుంటున్నారు అని హర్షిత్ ట్వీట్ చేశారు.

పార్టీ ప్రకటన చేస్తున్నప్పుడు ఒక్కసారి అభిమానుల కోలాహలం చూడండి. ఇంకా చేయాల్సింది చాలా ఉంది... అని వెంగట్ రామన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

ఇప్పుడేగా ప్రకటించారు. ఆయన రాజకీయాల్లో నిరక్షరాస్యుడు. ఇదంతా కేవలం మీడియా అత్యుత్సాహం మాత్రమే. తమిళ ప్రజలు చాలా తెలివైనవారు... అని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు.

Image copyright facebook

రాజకీయ అంశాలపై ఆయన అభిప్రాయాలు, ప్రణాళికలు ఇంకా చెప్పలేదు. ఇది కేవలం నిర్ణయం మాత్రమే. అని ఫేస్‌బుక్‌లో చిరంజీవి అనుమల కామెంట్ చేశారు.

Image copyright facebook

ఇతర సినీ స్టార్ల మాధిరిగానే మీరూ రాజకీయ పదవి కోసం 68 ఏళ్ల వయసులో ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలను ఎంజాయ్ చేయడానికి చాలా ఆలస్యమైందని ఫణి కుమార్ సత్తిరాజు ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)