దువ్వాడలో బధిర బాలికపై అత్యాచారం

  • 3 జనవరి 2018
rape Image copyright Getty Images

విశాఖపట్నం లోని దువ్వాడ ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతంలో అరకుకి చెందిన బధిర బాలిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన డిసెంబర్ 30న సాయంత్రం ఖాళీగా ఉన్న ఒక బస్సు లో చోటు చేసుకుంది.

విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలి హెచ్ బీ ఎల్ విభాగం కి చెందిన కాంట్రాక్టు బస్సు డ్రైవర్ చింతాడ విశ్వనాధం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విశాఖపట్నం పోలీసులు వెల్లడించారు.

అయితే మొదట నిందితుడు పారిపోయాడు. తోటి ఉద్యోగులు నిందితుని పట్టుకుని ప్రశ్నించినపుడు ఆయన 1.2 లక్షల రూపాయలతో సెటిల్మెంట్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని కోరారు.

అయితే ఈ వివరాలను స్థానిక పత్రిక 'లీడర్' వెలుగు లోకి తేవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Image copyright లీడర్
చిత్రం శీర్షిక లీడర్ పత్రికలో వచ్చిన కథనం

ఈ విషయాన్నిలీడర్ చీఫ్ ఎడిటర్ రమణ మూర్తి బీబీసి కి వెల్లడించారు.

ఈ ఘటన గురించి విశాఖపట్నం దక్షిణ జోన్ ఏసీపీ రామ్మోహన్ రావు బీబీసీకి వివరించారు.

15 ఏళ్లకుపైగా వయసుంటుందని చెబుతున్న బాలిక విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలి తోట పనుల్లో కూలి పని చేసుకోవడానికి అరకు లోయ నుంచి వచ్చిందని ఏసీపీ తెలిపారు.

ఈ అమ్మాయి డిసెంబర్ 30న సాయంత్రం తోటలోనికి వెళ్ళినపుడు, అటు వైపు వచ్చిన బస్సు డ్రైవర్ ఈ అమ్మాయిని బలవంతం చేసి, పక్కనే ఉన్న బస్సు లోకి లాక్కుని వెళ్లి, అత్యాచారం చేసినట్లు వివరించారు.

'ఆ అమ్మాయి కి మాటలు రాకపోవడంతో గట్టిగా అరవలేకపోయింది. ఎంతకీ ఈ అమ్మాయి వెనక్కి తిరిగి రాకపోయేసరికి తోటి ఉద్యోగులు వెతకగా, వివస్త్ర గా ఈ అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. విషయం గ్రహించిన స్థానికులు , బస్సు డ్రైవర్ ని ప్రశ్నించగా, అతను బస్సు అక్కడే వదిలేసి పారిపోయారు..' అని ఏసీపీ చెప్పారు.

స్థానికులు విషయాన్ని స్థానిక సెక్యూరిటీ అధికారులకు చెప్పారు. వారు మర్నాడు రమ్మని పంపివేశారు.

బాలిక సోదరుడు స్థానికులతో కలిసి డిసెంబర్ 31న కంపెనీ సెక్యూరిటీ ఆఫీసర్ సూర్య ప్రకాష్ రావు దగ్గరకి సహాయం కోసం వెళ్లారు.

Image copyright leader
చిత్రం శీర్షిక నిందితులు (వెనుక నిల్చుని ముఖాలను కవర్ చేసుకున్నవారు)

నిందితుడు హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్ కి చెందిన బస్సులో కాంట్రాక్టు ఉద్యోగి కావడంతో, ఆ సంస్థ బస్సు యజమాని, కంపెనీ సెక్యురిటీ ఆఫీసర్‌లను కూడా సమస్య పరిష్కారానికి పిలిపించినట్లు చెప్పారు.

అత్యాచారంపై ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు, ఈ బాలికకు 1.2 లక్షల రూపాయిలు ఇచ్చినట్లు తెలిపారు.

అయితే ఈ అమ్మాయికి కేవలం లక్ష రూపాయిలు మాత్రమే ఇచ్చి మిగిలిన సొమ్ముని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మిగిలిన మధ్యవర్తులు తీసుకున్నట్లు 'లీడర్' తెలిపింది.

ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న పత్రిక జనవరి 02న వార్త ప్రచురించింది.

విషయం తెలుసుకున్ననగర పోలీస్ కమీషనర్ టి యోగానంద్ దర్యాప్తు కి ఆదేశించారు.

పోలీసు అధికారులు బాధితురాలితో సైగలతోమాటలాడి అమ్మాయి చెప్పిన విషయం ఆధారం గా ఫిర్యాదు నమోదు చేశారు.

Image copyright Getty Images

బాధితురాలిని వైద్యం నిమిత్తం హాస్పిటల్ కి పంపినట్లు ఏసీపీ రామ్మోహన్ రావు బీబీసీ తో చెప్పారు.

చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సూర్య ప్రకాశ్ రావుని నిందితుడు చింతాడ విశ్వనాథం, బస్సు యజమాని అప్పల రాజుని కూడా కూడా పోలీస్ లు అదుపు లోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు.

విశాఖపట్నం ప్రత్యేక ఆర్ధిక మండలి అధికార కమీషనర్ శోభన కె ఎఫ్ ఎస్ రావు మాట్లాడుతూ.. అసలు బాధితులు ఎవరూ ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకుని రాలేదని చెప్పారు. పోలీస్ కమీషనర్ ద్వారా ఈ విషయం తనకి తెలిసిందని చెప్పారు.

బాధితురాలు ఆర్ధిక మండలి ఉద్యోగస్తురాలు కాదని, తాము హార్టికల్చర్లో పని చేసేందుకు వుడా కి కాంట్రాక్టు ఇచ్చామని చెప్పారు.

ఇతర కథనాలు

సంబంధిత అంశాలు