చైనా: షాంఘై సమీపంలో పెను ప్రమాదం.. 32 మంది గల్లంతు

  • 7 జనవరి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఆయిల్ ట్యాంకర్ నుంచి చెలరేగుతున్న అగ్నికీలలు

షాంఘై సముద్ర తీరానికి 296 కి.మీ. దూరంలో భారీ ప్రమాదం సంభవించింది.

శనివారం సాయంత్రం.. ఆయిల్ ట్యాంకర్, సరకు రవాణా చేసే నౌక పరస్పరం ఢీ కొనడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32మంది గల్లంతయ్యారు.

ప్రమాదానికి గురైన ట్యాంకర్లో 60 కోట్ల డాలర్లు విలువ చేసే 1,36,000 టన్నుల ఆయిల్ ఉంది.

ఈ ఘటనలో 30 మంది ఇరాన్ దేశీయులు, ఇద్దరు బంగ్లాదేశీయులు గల్లంతయినట్టు చైనా రవాణా శాఖ పేర్కొంది.

అయితే.. ప్రమాదానికి గురైన కార్గో షిప్‌లోని 21 మంది సిబ్బంది మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.

ప్రతికూల వాతావరణం, భారీగా చెలరేగుతున్న మంటల వల్ల సహాయక చర్యలు చేపట్టడం కష్టమవుంతోందని ఇరాన్ అధికారి మొహమ్మద్ రస్తాద్ ఇరాన్ మీడియాతో అన్నారు.

2016లో కూడా ఓ ఇరాన్ నౌకకు ఇలాంటి ప్రమాదమే జరిగింది. కానీ అందులో ప్రాణనష్టం వాటిల్లలేదు.

Image copyright AFP

సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 8 నౌకలను పంపామని చైనా అధికారిక టెలివిజన్ పేర్కొంది. గాలింపు చర్యల కోసం.. దక్షిణ కొరియా ఒక నౌకను, ఒక హెలికాప్టర్‌ను పంపింది.

ఆయిల్ ట్యాంకర్.. ఇరాన్ నుంచి దక్షిణ కొరియాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని రాయిటర్స్ తెలిపింది.

64,000 టన్నుల ధాన్యాలతో కార్గో షిప్‌ అమెరికా నుంచి దక్షిణ చైనాకు వెళుతోంది.

ఈ కార్గో షిప్ నుంచి బయటపడ్డ సిబ్బంది అందరూ చైనీయులేనని చైనా రవాణా శాఖ ప్రకటించింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)