హిందూమతం స్వీకరించి, ఆవుల్ని ఆదుకుంటున్న జర్మన్ మహిళ

హిందూమతం స్వీకరించి, ఆవుల్ని ఆదుకుంటున్న జర్మన్ మహిళ

ఉత్తర్ ప్రదేశ్‌లోని మధుర శ్రీకృష్ణ జన్మస్థానమని చాలా మంది విశ్వాసం. ఆ మధురలోనే ఇప్పుడు ఓ గోకులం వెలసింది.. ఆ గోకులాన్ని నిర్వహిస్తోంది మాత్రం.. ఓ జర్మన్ మహిళ.

ఈమె పేరు ఫ్రెడ్రిక్ బ్రూనింగ్. మధురలోని బ్రజ్ ప్రాంతంలో స్థిరపడ్డారు. అక్కడ తానొక్కరే నివసించడం లేదు.. తనతోపాటు 1200 ఆవులనూ పెంచుకుంటున్నారు.

ఈమె 40 సంవత్సరాలుగా అనాధ ఆవులను చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు. ముఖ్యంగా.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ఆవులను, రోగాల బారినపడ్డ ఆవులను అక్కున చేర్చుకుంటున్నారు.

ప్రపంచ యాత్ర చేస్తూ.. భారత్‌కు వచ్చిన ఫ్రీడ్‌రిక్ బ్రూనింగ్.. హిందూ మతాన్ని స్వీకరించారు. ఓ గురువునూ ఎంచుకుని ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు.

అందరూ ‘అంగ్రేజ్ దీదీ’ అని పిలిచే ఫ్రీడ్‌రిక్ బ్రూనింగ్ గోకులాన్ని ఓసారి పలకరిద్దాం రండి..

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)