బాలీవుడ్లో లైంగిక వేధింపులపై పోరాటం
హాలీవుడ్లో లైంగిక వేధింపులపై మొదలైన #metoo ఉద్యమం 75వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులకు తాకింది. ఈ ఉత్సవంలో హాలీవుడ్ తారలు నల్లటి దుస్తులు ధరించి తమ నిరసన తెలియజేశారు. బాలీవుడ్‌ను కూడా ఈ ఉద్యమం తాకుతుందా.. దీనిపై బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ బీబీసీతో మాట్లాడారు.
మనకంటూ ఓ స్థాయి లేకపోతే మనం ఏం చెప్పినా ప్రజలు పట్టించుకోరు. లైంగిక వేధింపులపై ప్రముఖులు మాట్లాడితేనే సంచలన వార్త అవుతోందని ఆమె అన్నారు.
లైంగిక వేధింపులపై బాలీవుడ్ నటీమణులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించినప్పుడు అలాంటి వాటిపై స్పందించడం చాలా కష్టమైన పని..సినీజీవితంపై దాని ప్రభావం పడుతుంది. వందలాదిమంది అభిప్రాయాలను వినాలి. అవి మన భావోద్వేగాల్ని కదిలించివేస్తాయిని తెలిపారు.
కొత్తగా బాలీవుడ్లో అడుగుపెట్టే అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొంటారని, అడిషన్లో చాలా మంది వంకర చూపులు భరించాల్సి ఉంటుందని చెప్పారు.
కేవలం సినిమా పరిశ్రమలోనే కాదు అన్ని చోట్లా ప్రతి మహిళా వేధింపులకు గురవుతూనే ఉంటారు. కానీ, ఇలాంటప్పుడు మహిళలు మౌనంగా ఉంటారు తప్పితే ఆ విషయం బయటకు చెప్పరని అన్నారు.
చిన్నప్పుడు తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని కల్కి చెప్పారు.
‘నా అనుభవాలు చెప్పినప్పుడు అవి సంచలన వార్తలుగా మారాయి. దీంతో చాలా ఒత్తడి వచ్చింది. అందుకే అలాంటివాటిపై స్పందించడం లేదు. ప్రతిరోజూ యుద్ధమే చేస్తుంటా. ఉదాహరణకు ఇలాంటి డ్రెస్సు ఎందుకు వేసుకున్నా? నా సినిమాకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? కొన్ని సీన్లకు ఇలాంటివి బాగుంటాయా అనిపిస్తుంది అనే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కుటుంబం, స్నేహితులు ఇంకా ఎవరైనా కావొచ్చు.
మనం ఏం చేస్తున్నా అండగా నిలబడేవాళ్లు కావాలి. పరస్పర విమర్శలకన్నా కలిసి మాట్లాడుకుంటేనే.. సమస్యలు పరిష్కారమవుతాయి అని కల్కి వివరించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)