#కోడిపందేలు: కోడి నెమలి ఎలా అయ్యింది?

 • 11 జనవరి 2018
అసిల్ Image copyright KAREN BLEIER/getty images

కోడి పందేలంటే ఆషామాషీ కాదు. ప్రతి చిన్న విషయానికి ఎంతో జాగ్రత్త తీసుకుంటారు.

పందెంలో రెండు అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒకటి కోడి జాతి. రెండు దానికి ఇచ్చే శిక్షణ. ఇక్కడ జాతి గురించి మాట్లాడుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో కాకి, సేతువ, నెమలి, కౌజు, డేగ, పర్ల వంటి రకాలకు ఆదరణ ఎక్కువ. ఈ కోళ్లన్నీ దాదాపు అసీల్ జాతికి చెందినవి. రెక్కల రంగు, ఇతర శారీరక లక్షణాల ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండు జాతుల కోళ్లకు మంచి ఆదరణ కనిపిస్తోంది. అవి అసీల్, షామో.

Image copyright Asil club/chenna charan
చిత్రం శీర్షిక రెజా అసీల్

అసీల్: వీటికి పుట్టినిల్లు భారతే. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో కనిపిస్తాయి. పోరాట పటిమకు అసీల్ పెట్టింది పేరు. ఈ జాతి కోళ్లు చాలా అందంగా ఉంటాయి. ఎంతో చురుకుగా కదులుతాయి. ఈ లక్షణాలే వీటికి ప్రపంచ గుర్తింపును తెచ్చిపెట్టాయి.

అసీల్ అంటే స్వచ్ఛమైన అని అర్థం.

1660-1680 మధ్య అసీల్ జాతి బ్రిటన్ వాసులకు పరిచయమైంది. భారత్, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వాళ్లు వీటిని తీసుకొచ్చారు.

రెజా, కులంగ్ అసీల్, షామో జాతులు ఇక్కడ కనిపిస్తాయి. 19వ శతాబ్దం నాటికి అసీల్ జాతి యూరప్ అంతటా విస్తరించింది. నేడు అమెరికా, జపాన్, థాయిలాండ్ వంటి దేశాల్లోనూ ఉన్నాయి.

చిత్రం శీర్షిక పచ్చ కాకి

అసీల్‌ జాతిలో అనేక రకాలుంటాయి.

రెజా: ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆదరణ ఎక్కువ.

 • బరువు దాదాపు 3 కేజీలు ఉంటుంది.
 • మంచి కండపుష్టి ఉండటంతోపాటు కళ్లు చురుకుగా ఉంటాయి.
 • కాలి గోళ్లు చాలా బలంగా, మొనదేలి ఉంటాయి.
Image copyright ASIL CLUB
చిత్రం శీర్షిక పాకిస్తాన్‌లో కనిపించే జావా అసిల్

కులంగ్: అసీల్ జాతిలో కులంగ్ రెండో రకం.

 • రెజాతో పోలిస్తే ఇవి పరిమాణంలో పెద్దవి.
 • బరువు 3.5-6 కేజీల మధ్య ఉంటుంది.
 • దక్షిణ భారత్‌లో కనిపించే వాటి ముక్కు చిన్నగా బలంగా ఉంటుంది.
 • ఉత్తర భారత్‌లో ఉండే కులంగ్ ముక్కు పొడవుగా ఉంటుంది.
చిత్రం శీర్షిక ఆబ్రాస్ రకం కోడి

మద్రాస్ అసీల్: తమిళనాడులో ఈ జాతి మూలాలు ఉన్నాయి.

 • జర్మనీ, హోలాండ్, బెల్జియం, ఇంగ్లాండ్, బోస్నియా, రష్యా వంటి దేశాల్లో ఈ జాతి విస్తరించి ఉంది.
Image copyright ASILCLUB
చిత్రం శీర్షిక బాంటమ్ అసీల్

బాంటమ్ అసీల్: జర్మనీ, హోలాండ్, బెల్జియం, ఆస్ట్రియా, ఇంగ్లాండ్, హంగేరీ వంటి దేశాల్లో ఈ బ్రీడ్ కనిపిస్తుంది.

 • జపాన్‌కు చెందిన కో షామో, రెజా అసీల్ కలయిక ద్వారా ఇది పుట్టింది.
Image copyright Facebook/AsilMurghaMianwali
చిత్రం శీర్షిక మియన్వాలి అసీల్

మియన్వాలి అసీల్: ఇది పాకిస్తాన్‌లో కనిపిస్తుంది.

 • ఎరుపు, తెలుపు, నలుపు ఈకల్లో ఈ కోళ్లు ఉంటాయి.
 • వీటి కాళ్లు చాలా బలంగా ఉంటాయి.
 • జావా, ముస్క, రియాజా, కబుత్రా, చందుల్ వంటి ఇతర రకాలకు కూడా పాకిస్తాన్‌లో ఆదరణ ఉంది.
Image copyright Facebook/ShamoPerfect
చిత్రం శీర్షిక జపాన్‌కు చెందిన షామో పందెం కోళ్లు

ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన పందెం కోళ్లలో జపాన్‌కు చెందిన షామో జాతి ఒకటి.

ఈ జాతి కోళ్లు బరువు, ఎత్తు, లావు విషయంలో సమతూకంతో ఉంటాయి.

వీటి వేగం, పోరాట పటిమ, బలం అందరినీ ఆకర్షిస్తాయి. ఇందులో ఒ షామో, చు షామో వంటి ఇతర రకాలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు LIVE: రాష్ట్రమంతా వైసీపీ ప్రభంజనం.. మీ నియోజకవర్గ కొత్త ఎమ్మెల్యే ఎవరు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: 348 స్థానాల్లో ఎన్డీయే ముందంజ.. ప్రజల విజయమన్న మోదీ

LIVE: వరంగల్‌లో భారీ ఆధిక్యంతో పసునూరి దయాకర్ గెలుపు... నల్లగొండ విజేత ఉత్తమ్ కుమార్ రెడ్డి

'చౌకీదార్'కు వీడ్కోలు చెప్పిన మోదీ.. అసలు దాని వెనక కథేంటి

కేఏ పాల్‌ను బీట్ చేసిన నోటా

వైఎస్ జగన్ ప్రెస్ మీట్: నేను ఉన్నా.. నేను విన్నా.. అని మరోసారి హామీ ఇస్తున్నా

ఎన్నికల ఫలితాలు 2019: ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ఏం జరుగుతోంది

నడిచొచ్చే నాయకులకు కలిసొచ్చే అధికారం

అమేఠీలో రాహుల్ గాంధీ వెనుకంజ.. ఆధిక్యంలో స్మృతీ ఇరానీ