#బతుకుసిత్రాలు

  • 11 జనవరి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి ఎవరు? నరాలు నొప్పి రాకుండా గార్డెనింగ్ చేయడం ఎలా?

ప్రపంచంలోనే బరువైన వ్యక్తి త్వరలో నాజూగ్గా మారబోతున్నారు. ఓ పందొమ్మిదేళ్ళ అమ్మాయి బర్మా శాస్త్రీయ సంగీతంతో ఉర్రూతలూగిస్తోంది. అలసిపోకుండా తోట పనులు చేయడం ఎలా.. ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలుతో ఈవారం బతుకు సిత్రాలు.

జువాన్ పెడ్రో ఫ్రాంకో బరువు 595 కిలోలు. ఆయన ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత బరువైన మనిషి.

స్థూలకాయం మూలంగా ఆయన చాలా ఏళ్ళు మంచానికే పరిమితమయ్యారు. అయితే, ఈ 33 ఏళ్ళ మెక్సికన్ జీవితం.. ఓ ప్రత్యేక శస్త్రచికిత్స మూలంగా పూర్తిగా మారిపోనుంది.

అదే జరిగితే.. ముందుగా కాస్త బయటకు వెళ్ళి స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటానని ఆయన అన్నారు. కొన్ని నెలల వ్యవధిలో ఆయన బరువు 120 కిలోలకు తగ్గుతుందని డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గార్డెనింగ్‌కి హాలీవుడ్ టెక్నాలజీ

గార్డెనింగ్ అనేది ఆహ్లాదంగా జీవించడానికి మీకొక మంచి హాబీ అవ్వచ్చు. కానీ, మీరు ఎప్పుడైనా గార్డెన్ ప్యాచెస్ ని తవ్వేటపుడు గాయపడితే, అందుకు తప్పు పట్టాల్సింది మాత్రం, మీరు తవ్వుతున్న విధానాన్నే.

ఈయన, నరాల నొప్పితో బాధపడుతున్నారు. దాంతో, ఎంతో ఇష్టమైన గార్డెనింగ్ హాబీని కొన్ని నెలల పాటు ఆపారు. ఇప్పుడు బ్రిటన్ లోని శాస్త్రవేత్తలు, హాలీవుడ్ లో ఉన్న టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీనిని అక్కడి స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం తయారు చేశారు.

ఇప్పుడు, గాయపడటానికి తక్కువగా ఆస్కారం ఉండే ఈ షోవెల్ టెక్నిక్ ను అభివృద్ది చేసే పనిలో ఉన్నారు.

ఈ యువతి సంగీత బృందానికి లీడర్

బర్మాలోని ఈ తరం యువతీయువకులు చాలా మందికి సంప్రదాయ సంగీతం ఓ గతం. కానీ, ఈ 19 ఏళ్ళ అమ్మాయి మాత్రం తన బృందంతో సంప్రదాయ సంగీత రీతులను సజీవంగా కొనసాగిస్తోంది.

మూడేళ్ళ కిందట తండ్రి చనిపోవడంతో పొన్యెట్ హ్యూ ఈ బాధ్యతను చేపట్టింది.

జట్టులో అందరూ తనకన్నా పెద్దవాళ్ళేనంటున్న పోన్యెట్.. పురుషాధిక్య సమాజంలో ఓ అమ్మాయి సంగీత బృందానికి నాయకత్వం వహించడం అంత సులభం కాదనీ చెబుతున్నారు.

ఆ సంగతి పక్కనపెడితే.. ఆమె బ్యాండ్ విజయవంతంగా దూసుకుపోతోంది. గత ఏడాది వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: పవన్ కల్యాణ్ రెండు చోట్లా వెనుకంజ.. మంగళగిరిలో నారా లోకేశ్ ఎదురీత

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: 294 స్థానాల్లో బీజేపీ.. 52 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

LIVE: తెలంగాణలో 4 స్థానాల్లో బీజేపీ ముందంజ... ఏపీలో ప్రభావం చూపని జనసేన: ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

నారా చంద్రబాబు నాయుడు: రాజకీయ చాతుర్యం, పరిపాలనా దక్షత వయసు రీత్యా బలహీనపడ్డాయా

వైఎస్ జగన్మోహన్ రెడ్డి: ఎవరినైనా ఎదిరించి నిలబడే తత్వం, కొత్తతరం నాయకుల ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో ఓడిపోతున్నదెవరు.. గెలిచేదెవరు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మీ నియోజకవర్గంలో ఎవరిది ఆధిక్యం

వైసీపీ జోరు.. టీడీపీలో లోకేశ్ సహా మంత్రులు సైతం వెనుకంజ.. పవన్ సహా జనసేన అభ్యర్థులు డీలా

40,000 తాకిన సెన్సెక్స్.. చరిత్రలోనే తొలిసారి