అవే పందేలు.. అవే కత్తులు

  • 15 జనవరి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఅవే పందేలు.. అవే కత్తులు

కోర్టులు ఎన్ని ఆంక్షలు విధించినా.. పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టినా సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ర్టాల్లో కోడి పందేలు మాత్రం ఆగలేదు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ కోళ్లకు కత్తులు కట్టి మరీ పందేలు నిర్వహించారు.

కోడి పందేల కోసం ప్రత్యేక టెంట్లు వేసి మరీ ఏర్పాట్లు చేశారు.

పలు పార్టీలకు చెందిన నేతలు కూడా దగ్గరుండి ఈ కోడి పందేలను జరిపించారు.

ఈ పందేల సందర్భంగా రాష్ర్టంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా.

భోగి పండగైన ఆదివారం మొదలైన ఈ పందేలు సోమవారం కూడా జోరుగా సాగాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: కోళ్ల పందేలను చూసేందుకు వచ్చిన జనం, నేతలు

మొదట కత్తులు లేకుండా పందేలు ప్రారంభించిన వారు కూడా తర్వాత కోళ్లకు కత్తికట్టారు.

పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు వేల మంది ఈ పందేలను తిలకించారు.

కోడి పందేల ద‌ృశ్యాలను పై వీడియోల్లో చూడవచ్చు. కొన్ని దృశ్యాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు.

ఈ పందేలు మంగళవారం కూడా పలు చోట్ల కొనసాగనున్నాయి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.