వర్మ నాయిక, పోర్న్ స్టార్ మాల్కోవా మరో సన్నీలియోని కాబోతున్నారా!

ఫొటో సోర్స్, Ram gopal verma/twitter
'సత్య', 'కంపెనీ', 'సర్కార్' లాంటి సినిమాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి పతాక శీర్షికల్లో నిలిచారు.
దీనికి కారణం ఆయన కొత్త సినిమా: గాడ్, సెక్స్ అండ్ ట్రూత్.
కేవలం రెండు రోజుల క్రితమే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ను అప్పుడే కోటి మందికి పైగా వీక్షించారు.
ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా.
ఫొటో సోర్స్, Ram Gopal Varma
ఫొటో సోర్స్, Twitter/Ram Gopal Verma
సినిమాలో ఏముంటుంది?
ఈ చిత్రం ట్రైలర్లో మాల్కోవా మహిళల శరీరం గురించి, శరీర వాంఛల గురించి మాట్లాడారు.
ట్రైలర్లో మాల్కోవా ఒక చోట, 'మహిళ ఒకరి సొత్తు కాదు' అంటారు.
లైంగిక శాస్త్ర దృక్పథం నుంచి ఇది ఒక సంచలనాత్మక చిత్రం అవుతుందని రామ్ గోపాల్ వర్మ అన్నారు.
''ఇది సెక్స్ వెనుక ఉన్న నిజాలను గురించి దేవుని ఆలోచనలను తెలియజేస్తుంది'' అని ట్వీట్ చేశారు.
ఫొటో సోర్స్, You Tube
మియా మాల్కోవా ఎవరు?
- ఎత్తు - 5 అడుగుల 7 అంగుళాలు
- వయసు - 25 ఏళ్లు
- పేరు - మియా మాల్కోవా
- జన్మస్థలం - అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతం
మియా మాల్కోవా గురించి ఇక్కడివరకే చెప్పి ఆపేస్తే సరిపోదు. పోర్న్ ఇండస్ట్రీలో బాగా ప్రాచుర్యం పొందిన వారిలో మాల్కోవా ఒకరు.
పోర్న్‌లోకి రాక ముందు ఆమె కొన్ని రెస్టారెంట్లలో పని చేశారు. మరో పోర్న్ స్టార్ నటాషా మాల్కోవా ఆమెను పోర్న్ పరిశ్రమకు పరిచయం చేశారు.
మియా, నటాషా ఇద్దరూ కలిసే చదువుకున్నారు. పోర్న్లో అతి తక్కువ సమయంలోనే మియా పోర్న్ చిత్రాలకు చెందిన పలు అవార్డులను గెలుచుకున్నారు.
ఫొటో సోర్స్, Ram Gopal Varma/Twitter
బాలీవుడ్లో రెండో పోర్న్ స్టార్
2012లో పోర్న్ పరిశ్రమలోకి ప్రవేశించిన మియా మాల్కోవాపై, ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దానికి కారణం సన్నీ లియోని తర్వాత బాలీవుడ్లో ప్రవేశిస్తున్న రెండో పోర్న్ స్టార్ మాల్కోవా.
గత వారం ఆమె తన చిత్రం పోస్టర్‌తో ''భారతీయ దర్శకులు రామ్ గోపాల్ వర్మ నాతో 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' అన్న వీడియో షూట్ చేశారు'' అంటూ ట్వీట్ చేశారు.
వర్మతో కలిసి షూటింగ్లో పాల్గొన్న చిత్రాలను కూడా ఆమె ట్వీటర్లో పంచుకున్నారు.
వర్మ కూడా ట్వీటర్లో మియా మాల్కోవాపై ప్రశంసలు కురిపించారు. ''నేనెప్పుడూ సన్నీ లియోనితో కలిసి పని చేయలేదు. కానీ మియా మాల్కోవాతో కలిసి షూటింగ్ చేయడాన్ని మాత్రం ఎన్నడూ మర్చిపోలేను'' అని వర్మ పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, youtube
'గన్స్ అండ్ థైస్'తో వర్మ సంచలనం
సంచలన కథాంశంతో చిత్రం నిర్మించడం వర్మకు ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే ఆయన 'నిశబ్ద్' లాంటి చిత్రాలతో కావాల్సినంత సంచలనం సృష్టించారు.
గత ఏడాది మే లో వర్మ 'గన్స్ అండ్ థైస్' పేరుతో యూట్యూబ్‌లో వెబ్ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
ఊర్మిళా మండోద్కర్
ఆ ట్రైలర్లో హింస, రక్తపాతంతో పాటు కొన్ని నగ్న సన్నివేశాలు కూడా ఉన్నాయి.
వెబ్ సిరీస్ గురించి ఆ చిత్రం వెబ్ సైట్‌పై వర్మ చెప్పిన కారణం, ''ఇది తీసుకురావడానికి ముఖ్యకారణం, ఈ కథను బిగ్ స్క్రీన్‌పై చూపించడానికి నాకు అనుమతి లభించలేదు.''
గతంలో వర్మ 'రంగీలా' చిత్రంతో ఊర్మిళా మండోద్కర్కు బ్రేక్ ఇచ్చారు. మరి మాల్కోవాకు కూడా అలాంటి బ్రేక్ ఇస్తారా? మియా మాల్కోవా బాలీవుడ్లో సన్నీ లియోనిని మించిపోతారా?
ఇవి కూడా చదవండి:
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
- పోర్నోగ్రఫీ సమస్యకు పోలీసుల షాక్ థెరపీ
- నన్నురేప్ చేశారంటే ఎవరూ నమ్మలేదు
- ఫేస్బుక్ సెక్స్ వీడియో వివాదం.. వెయ్యి మందిపై కేసు
- సోషల్ మీడియా... నిద్ర రాదయా!
- సుప్రీంకోర్టు: ఇంతకూ ‘రోస్టర్’ ఏంటి? దాని ప్రాధాన్యం ఏంటి?
- హజ్ సబ్సిడీ రద్దుపై ముస్లింలేమంటున్నారు?
- ‘నన్ను ఎన్కౌంటర్ చేసే కుట్ర జరుగుతోంది’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)