ఐసీసీ అవార్డుల్లో ఆధిపత్యం అతడిదే

 • 18 జనవరి 2018
కోహ్లి Image copyright Getty Images

పరుగుల వేటలోనే కాదు అవార్డుల రేసులోనూ తనకు తిరుగులేదని విరాట్ కోహ్లి మరోసారి నిరూపించాడు. గురువారంనాడు ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ప్రకటించిన అవార్డుల్లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.

2017కిగానూ ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌’గా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు.

‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ ఘనత కూడా కోహ్లికే దక్కింది.

అక్కడితో ఆగలేదు.. ఐసీసీ టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌ స్థానం కూడా కోహ్లినే దక్కించుకున్నాడు.

2017లో టెస్టుల్లో కోహ్లి 2203 పరుగులు, వన్డేల్లో 76.84 సగటుతో 1818పరుగులు చేశాడు. టీ20ల్లో 150కిపైగా స్ట్రైక్ రేట్‌తో 299పరుగులు నమోదు చేశాడు.

Image copyright Twitter/icc

‘29ఏళ్ల వయసులో కోహ్లి ఇప్పటికే 32 వన్డే సెంచరీలు నమోదు చేశాడు. ఇదే స్థాయిలో ఆడితే, తన అభిమాన ఆటగాడు సచిన్ సాధించిన 49వన్డే సెంచరీల రికార్డును అధిగమించడం కోహ్లికి కష్టం కాబోదు’ అని ఐసీసీ పేర్కొంది.

తనను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తించినందుకు కోహ్లి ఐసీసీకి కృతజ్ఞతలు చెప్పాడు. ‘క్రికెట్‌లో ఇదే అత్యుత్తమ అవార్డని నా భావన. గతేడాది అశ్విన్‌కి, ఈసారి నాకు ఈ అవార్డు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని కోహ్లి అన్నాడు.

గత మూడేళ్లలో తొలిసారి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్షిణాఫ్రికాయేతర ఆటగాడికి దక్కింది. 2014, 2015లో డివిలియర్స్, 2016లో క్వింటన్ డి కాక్ ఆ అవార్డును దక్కించుకున్నారు.

భారత ఆటగాడు యజ్వేంద్ర చాహల్ టీ20 పర్ఫామర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.

Image copyright facebook/icc

2017 ఐసీసీ మెన్స్ అవార్డుల పూర్తి జాబితా

సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ - ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: విరాట్ కోహ్లి (భారత్)

టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)

వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: విరాట్ కోహ్లి

ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: హసన్ అలీ (పాకిస్తాన్)

అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్)

టీ20 పర్ఫామెన్స్ ఆఫ్ ది ఇయర్:యజ్వేంద్ర చాహల్ (6-25 వర్సెస్ ఇంగ్లండ్) భారత్

ఐసీసీ ప్రకటించిన వన్డే జట్టు

 • డేవిడ్ వార్నర్
 • రోహిత్ శర్మ
 • విరాట్ కోహ్లి (కెప్టెన్)
 • బాబర్ ఆజమ్
 • ఏబీ డివిలియర్స్
 • క్వింటన్ డి కాక్
 • బెన్ స్టోక్స్
 • ట్రెంట్ బౌల్ట్
 • హసన్ అలీ
 • రషీద్ ఖాన్
 • జస్ప్రి త్ బుమ్రా

ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టు

 • డీన్ ఎల్గార్
 • డేవిడ్ వార్నర్
 • విరాట్ కోహ్లి (కెప్టెన్)
 • స్టీవ్ స్మిత్
 • చతేశ్వర్ పుజారా
 • బెన్ స్టోక్స్
 • క్వింటన్ డి కాక్
 • ఆర్. అశ్విన్
 • మిచెల్ స్టార్క్
 • రబాడా
 • ఆండర్సన్

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)