సోషల్ మీడియా: అల్లం, తేనె ఫ్లేవర్లలో కండోమ్‌లు!

  • 23 జనవరి 2018
Condoms Image copyright Getty Images

చాక్లెట్, వనీలా, స్ట్రాబెర్రీ, కాఫీ, ఊరగాయ తరువాత ఇప్పుడు ప్రత్యక్షమయ్యాయి అల్లం, తేనె!

కండోమ్ ఫ్లేవర్ల ముచ్చట్లు ఇవి. కండోమ్‌లు తయారుచేసే ఒక కంపెనీ, ఈ శీతాకాలంలో అల్లం ఫ్లేవర్ కండోమ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

దీని వివరాలన్నీ, ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అన్ని సోషల్ మీడియా వెబ్‌సైట్‌లలో ఇచ్చింది. ఈ కొత్తం ఫ్లేవర్ కండోమ్ ఫొటో పోస్ట్ చేస్తూ ఈ కింది వాక్యాలు జతపరిచింది.

"తేలికైన గొంతు కోసం అల్లం, తేనె. ప్రవేశపెడుతున్నాం అల్లం ఫ్లేవర్."

Image copyright MANFORCE / FACEBOOK

దీనితోపాటు మరికొన్ని శీర్షికలు కూడా పోస్ట్ చేసింది. అవి:

"అయితే, ఈ శీతాకాలంలో మీ ఉదయాన్ని ఎలా ప్రారంభిద్దామనుకుంటున్నారు? మీ చలికాలపు ఉదయాలలో వెచ్చదనం నింపడానికి, మీకు ప్రియమైనది."

"ఇప్పుడు చలికాలం ఇంకాస్త వెచ్చగా, సేదతీరి ఉంటుంది. ప్రవేశపెడుతున్నాం అల్లం ఫ్లేవర్‌తో కండోమ్‌లు."

ఈ విషయం మీద సోషల్ మీడియాలో చాలా కోలాహలంగా ఉంది. దీనిపై సరదా వ్యాఖ్యలు చేస్తూ, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

Image copyright TWITTER

"ఇప్పుడు అల్లం ఫ్లేవర్ తరువాత మరేమొస్తుందో అని నాకు కుతూహలంగా ఉంది. అల్లం-వెల్లుల్లి పేస్ట్ తరువాత అల్లం-వెల్లుల్లి చనా మసాలా ఫ్లేవర్ కండోమ్?" అంటూ వరుణ్ ఖుల్లర్ అనే అతను తన ట్విటర్‌లో సరదా వ్యాఖ్య చేసారు.

వీటికి జవాబు ఇవ్వడంలో ఆ కండోమ్ తయరు చేసిన కంపెనీ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. అదే తరహాలో హాస్యభరితమైన జవాబులు ఇస్తోంది.

"ఇప్పుడు అల్లం నిండుకుందనే చింత లేదు. కటింగ్ చాయ్ తయారు చేస్తున్నప్పుడు రెండు మూడు అల్లం ఫ్లేవర్‌వి పడేస్తే సరి" అని నీలాద్రి అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ వాల్‌పై పరిహాసమాడారు.

Image copyright facebook

దీనికి ఆ కంపెనీ "కండోమ్ వాడుకకు మరో కారణం దొరికింది" అంటూ చమత్కారమైన జవాబు ఇచ్చింది.

కొందరేమో "అతిమధురం" (ఆయుర్వేదంలో వాడే మందు దినుసు) ఫ్లేవర్ ప్రవేశపెట్టమని, మరికొందరేమో బిర్యాని, నిమ్మకాయ ఫ్లేవర్‌లు తయారు చెయ్యమని ఆ కంపెనీకి సలహాలిచ్చారు.

Image copyright Getty Images

ఫ్లేవర్‌తోఅసలేమైనా ఉపయోగం ఉంటుందా?


ఇవన్నీ సరదాగా చేసిన వ్యాఖ్యలు. కానీ, నిజంగా ఇలాంటి ఫ్లేవర్‌లు ప్రజల లైంగిక జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయా? లేదా ఇవన్నీ మార్కెట్ యుక్తులేనా?

ఈ విషయమై బీబీసీ ప్రసిద్ధ సెక్సాలజిస్ట్ డా. ప్రకాష్ కొఠారీతో సంభాషించింది.

ఆయన మాటల్లో "ఈ విధమైన ఫ్లేవర్‌లు సెక్స్ కోరికలను పెంచగలవేమోగానీ లైంగిక జీవితంపై ఎటువంటి ప్రభావం చూపవు. ఉదాహరణకు, అల్లం, తేనె ఫ్లేవర్‌లు ఇష్టపడేవాళ్ళు తమ భాగస్వామిని దగ్గరకు రానివ్వడానికి ఆసక్తి చూపించొచ్చు. అందుకు ఈ ఫ్లేవర్ కండోమ్‌లు సహాయం చెయ్యొచ్చు."

ఇంకాస్త వివరిస్తూ, వీటివల్ల సెక్స్ వ్యవధి గానీ, ఎంత బాగా జరుగుతుంది అనేది కానీ ఏ మాత్రం ప్రభావం చెందవు అని డా. కొఠారీ అన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)