స్వచ్ఛభారత్: ఈ నగరంలో చెత్త కుప్పల్ని తీసేశారు.. రంగు రంగుల ముగ్గులు వేశారు

  • 30 జనవరి 2018
తిరుచ్చిలో స్వచ్ఛ భారత్

చెత్త సమస్యను వదిలించుకునే దిశగా తమిళనాడులోని తిరుచ్చి నగరం చేపట్టిన ఒక కలర్‌ఫుల్ కార్యక్రమం బాగా పాపులర్ అయ్యింది.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్‌లో గతేడాది 6వ స్థానంలో ఉన్న ఈ నగరం ఈ ఏడాది తొలిస్థానం కోసం కష్టపడుతోంది.

బీహెచ్ఈఎల్, ఎన్ఐటీ, ఐఐఎంలతో పాటు ఒక వినాయకుడి ఆలయానికి పేరొందిన తిరుచ్చి ఇప్పుడు చెత్త సమస్యసు రంగురంగు ముగ్గులతో వదిలించుకోవాలని చూస్తోంది.

నగరంలో మొత్తం 700 ప్రాంతాల్లో 1400 చెత్త సేకరణ కంటైనర్లు ఉండగా.. ఇప్పుడ ‘చెత్త సేకరణ కంటైనర్లు లేని నగరం’గా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటన్నింటినీ తొలగించారు.

చెత్తను బయటికి తీసుకొచ్చి ఒక ప్రాంతంలో వేయాల్సిన అవసరం లేకుండా మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి చెత్తను సేకరించాలని అధికారులు నిర్ణయించారు.

ఇందులో పెద్దగా విశేషం ఏమీ లేకపోయినప్పటికీ.. ఎక్కడెక్కడి నుంచైతే చెత్త కంటైనర్లను తొలగించారో మళ్లీ ఆ ప్రాంతంలో ప్రజలు చెత్త వేయకుండా ఎలా ఆపాలి?

ఆయా ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ ప్రయత్నం విజయవంతమైంది.

మున్సిపల్ సిబ్బంది సృజనాత్మకంగా వేసిన ఈ ముగ్గుల అందాన్ని చెడగొట్టకూడదనుకున్నారేమో ప్రజలెవరూ అక్కడ చెత్తను వేయట్లేదు.

ప్రజల నుంచి సేకరించిన చెత్తను 18 కేంద్రాల్లో మైక్రో ప్రాసెసింగ్ చేసి.. పంటలకు ఎరువుగా మారుస్తున్నారు. పైగా, దీన్ని రైతులకు ఉచితంగా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం