LIVE : వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులు యథాతథం

పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం మొదలైంది. తొలిసారి బడ్జెట్ ప్రసంగం హిందీలో ప్రారంభం కావడం విశేషం.
తన ప్రసంగాన్ని హిందీ, ఇంగ్లిష్ భాషలలో కొనసాగిస్తున్నారు.
పలువురు విశ్లేషకులు ఊహించినట్టుగానే పేదలకు భారీ పథకాల ప్రకటనలు ఈ బడ్జెట్లో ఉన్నాయి.
బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:
వ్యవసాయ రంగం:
- 2022కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం.
- వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలి.
- ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను ఒకటిన్నర రెట్లు పెంచింది.
- 85 శాతం కన్నా ఎక్కువ మంది చిన్న, మధ్య తరగతి రైతులే.
- గ్రామీణ వ్యవసాయ మార్కెట్ల ఏర్పాటుకు రూ. 2,000 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తాం.
- చేపల పెంపకం, ఆక్వా కల్చర్ అభివృద్ధి, పశుసంరక్షణ కోసం రూ. 10,000 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తాం.
- గ్రామీణ ప్రాంతాల్లో అన్ని మంత్రిత్వ శాఖలు కలిసి రూ. 14.34 లక్షల కోట్లు చేశాయి.
- పంట వ్యర్థాలను తగులపెట్టకుండా, ఇతర ప్రక్రియలో తొలగించడం కోసం ప్రత్యేక సబ్సిడీ.
- ఆదివాసుల కోసం రూ. 56,000 కోట్లు
విద్యారంగం:
- బ్లాక్ బోర్డు నుంచి డిజిటల్ బోర్డు వైపు
- ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంచడానికి ఇంటిగ్రేటెడ్ బీ.ఎడ్ కోర్సు
- నవోదయ విద్యాలయ తరహాలో ఆదివాసీ ప్రాంతాల్లో ఏకలవ్య విద్యాలయాల ఏర్పాటు
వైద్యం:
- 10 కోట్ల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా జాతీయ వైద్య పథకం
- ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా పథకం
- 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాలు తెరుస్తాం.
- ప్రతి మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఒక మెడికల్ కాలేజి ఏర్పాటు.
పరిశ్రమలు:
- చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ. 3,700 కోట్లు
ఉద్యోగ కల్పన - ఉపాధి:
- అన్ని రంగాలలో నూతన ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వం 12 శాతం కాంట్రిబ్యూట్ చేస్తుంది.
- తొలి మూడేళ్లలో మహిళా ఉద్యోగుల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 8 శాతానికి తగ్గింపు. ఆ మేరకు ఉద్యోగులకు లబ్ధి
- ముద్రా రుణాలకు రూ. 10.38 లక్షల కోట్లు
పర్యాటకం:
- 10 స్థలాలను థీమ్ పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేస్తాం.
- 10 ఆదర్శ కట్టడాల అభివృద్ధి.
రైల్వే:
- రైల్వేకు 1,48,528 కోట్ల కేటాయింపు.
- 4267 కి.మీ. రైలు మార్గం విద్యుదీకరణ.
- 4,000 కాపలా లేని క్రాసింగ్లకు ముగింపు
- అన్ని రైల్వే స్టేషన్లలోనూ, రైళ్లలోనూ ఉచిత వై-ఫై
- త్వరలో అన్ని టోల్ గేట్లలో నగదు చెల్లింపుల స్థానంలో డిజిటల్ చెల్లింపులు.
- ముంబయి రైలు మార్గ విస్తరణకు రూ. 11,000 కోట్లు.
ఇతరత్రా...
- 99 నగరాలు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి
- అక్రమ లావాదేవీలకు ఊతమందిస్తున్న అన్ని రకాల క్రిప్టోకరెన్సీపై నియంత్రణ.
- రక్షణ ఉత్పత్తులలో ప్రైవేటీకరణ ద్వారా ఆధునీకరణకు దారులు సుగమం.
- ఈ సంవత్సరానికి రూ. 80 వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం. ఇందులో ఎయిర్ ఇండియా కూడా భాగం.
- వేతనాలలో పెంపు: రాష్ట్రపతికి రూ. 5 లక్షలు, ఉపరాష్ట్రపతికి రూ. 4 లక్షలు, గవర్నర్లకు రూ. 3.5 లక్షలు.
- పార్లమెంటు సభ్యులకు ప్రతి ఐదేళ్లకోసారి సమీక్షించే ప్రతిపాదన.
- ద్రవ్యలోటు తగ్గింది. ఈ సంవత్సరం రూ. 5.95 లక్షల కోట్లు.
- పరోక్ష పన్నుల్లో 12.6 శాతం, ప్రత్యక్ష పన్నుల్లో 18.7 శాతం పెరుగుదల నమోదైంది.
- రూ. 250 కోట్ల టర్నోవర్ గల కంపెనీలకు 25 శాతం కార్పొరేట్ టాక్స్ వర్తింపు.
- రైతు కంపెనీలుగా రిజిస్టరు చేసుకున్న వాటికి 100 శాతం పన్ను మినహాయింపు
- వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులు యథాతథం
- కార్పొరేట్ పన్నులలో కంపెనీలకు రాయితీలు
- లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ ఇప్పుడు పన్నుల పరిధిలోకి. రూ. లక్ష వరకు కేపిటల్ గెయిన్స్‌పై 10 శాతం పన్ను.
- బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావనకు రాని రైల్వే జోన్: ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ గురించి గానీ, రాజధాని గురించి గానీ ప్రసంగంలో ఎక్కడా పేర్కొనలేదు.
మీ కోసం మరి కొన్ని కథనాలు..
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఇది ప్రజాకర్షక బడ్జెట్‌గా ఉండొచ్చని భావిస్తున్నారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టి ఓ వైపు వచ్చే సంవత్సరం జరుగనున్న ఎన్నికల మీదా, మరోవైపు ద్రవ్య లోటును పూడ్చుకోవడం పైనా ఉండక తప్పదు.
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగా, ప్రస్తుత ప్రభుత్వం ముందు ఇంకా ఏమేం సవాళ్లున్నాయో కింద ఇచ్చిన లింక్‌లో చదవండి:
ఈ బడ్జెట్‌కు ప్రాధాన్యం, దీనిపై ఆసక్తి ఎక్కువగానే ఉన్నాయి. అయితే బడ్జెట్ ప్రసంగాన్ని, బడ్జెట్‌తో ముడిపడిన వ్యవహారాలను అర్థం చేసుకోవాలంటే ఈ పది ప్రాథమిక అంశాలు మీరు తెలుసుకోవాల్సిందే.
ఫొటో సోర్స్, Reuters
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
ఆర్థిక సర్వే
కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే ప్రభావం తర్వాత వచ్చే బడ్జెట్‌పై ఉంటుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో 2017-18 ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7 నుంచి 7.5 శాతం వృద్ధి చెందొచ్చని సర్వే నివేదిక వెల్లడించింది.
అందులోని పది ముఖ్యమైన అంశాలు చదవాలంటే.. ఈ లింక్ క్లిక్ చేయండి..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)