పురుగులే కనురెప్పలు.. కీటకాలే కనుబొమ్మలు

  • 1 ఫిబ్రవరి 2018
జాస్మిన్ మేకప్ Image copyright Instagram/butterflyjasmine49

కనురెప్పలకు చిన్నచిన్న పురుగులు. కనుబొమ్మలపై సీతాకోక చిలుకలు.. తుమ్మెదలు.. తేనెటీగలు.

ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇదంతా ఓ రకమైన మేకప్‌ని తెలిస్తే ఇంకేమై పోతారో మరి.

Image copyright Instagram/butterflyjasmine49
చిత్రం శీర్షిక జాస్మిన్

రంగులు మాత్రమేనా?

మేకప్‌లో రంగులేనా.. పురుగులు, కీటకాలు ఎందుకు ఉండకూడదంటోంది అమెరికా కళాకారిణి జాస్మిన్ అహుమదా. తన కళ్లనే కాన్వాస్‌గా చేసి వినూత్న మేకప్‌తో పలువురిని ఆకట్టుకుంటోంది. కళలోని మరో సృజనాత్మక కోణాన్ని ఆవిష్కరించడానికే ఇదంతా చేస్తున్నట్లు ఆ భామ చెబుతోంది.

Image copyright Instagram/butterflyjasmine
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో:

అన్నింటినీ ప్రేమించాలి

సాధారణంగా చాలా మంది పురుగులు, కీటకాలు వంటి వాటిని అసహ్యించుకుంటారు. కానీ తాను మాత్రం ప్రకృతిలోని ప్రతి జీవినీ ఎంతో ప్రేమగా చూస్తానని జాస్మిన్ అంటోంది. తన కళ ద్వారా ఈ సందేశాన్నే ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

Image copyright Instagram/butterflyjasmine49

ఆ రంగులే ప్రేరణ

అంతేకాదు సీతాకోక చిలుకలు, తుమ్మెదలు, బొద్దింకలు, తేనెటీగలు, వానపాములు వంటివి అనేక రంగుల్లో ఉంటాయని అవి తనకు ఎంతో ప్రేరణ కలిగిస్తాయని జాస్మిన్ తెలిపారు. అంతేకాదు వాటి శరీరాకృతి కూడా ఎంతో ఆకట్టుకుంటుందని అన్నారు.

Image copyright Instagram/butterflyjasmine49

మేకప్ ఎలా?

జాస్మిన్ తన మేకప్‌లో చనిపోయిన సీతాకోక చిలుకలు, తేనెటీగలు, తుమ్మెదలు వంటి వాటిని వినియోగిస్తారు. కొన్ని చనిపోయిన కీటకాలను వాటిని ఆమె సేకరిస్తారు. మరికొన్నింటిని ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకుంటారు.

Image copyright Instagram/butterflyjasmine49

సోషల్ మీడియా వేదికగా

జాస్మిన్ సోషల్ మీడియా వేదికగా తన మేకప్ చిత్రాలను పంచుకుంటున్నారు. ఒకో కీటకం లేదా పురుగు సంబంధించి ఒకో ప్రత్యేకమైన థీమ్‌తో జాస్మిన్ మేకప్ వేసుకుంటారు. ఆ కీటకం లేదా పురుగు గురించి వివరాలను కూడా పోస్ట్ చేస్తారు.

మొత్తానికి సృజనాత్మకతకు హద్దులు లేవని జాస్మిన్ చాటుతున్నారు. మల్లెపూల మాదిరిగానే ఆమె ప్రతిభ కూడా గుభాళిస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)