సూపర్ బ్లూ బ్లడ్ మూన్: ప్రపంచం నలుమూలల్లో ఇలా కనిపించింది

  • 31 జనవరి 2018
Image copyright AFP

సూపర్ బ్లూ బ్లడ్ మూన్‌గా పిలుస్తున్న చంద్ర గ్రహణం బీజింగ్‌లో ఇలా కనిపించింది.

Image copyright Reuters

అరుదుగా వచ్చే ఈ చంద్ర గ్రహణాన్ని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ప్రజలు దీన్ని చూశారు. పై చిత్రం బ్యాంకాక్‌లో ఒక ఆలయం వద్ద తీసింది.

Image copyright EPA

చంద్ర గ్రహణం, బ్లడ్ మూన్, సూపర్ మూన్.. ఈ మూడూ ఒకేరోజు వస్తే దాన్నే సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దాన్ని బ్లూమూన్ అంటారు. భూమికి దగ్గరగా చంద్రుడు వస్తే దాన్ని సూపర్ మూన్ అంటారు. పై చిత్రం మయన్మార్ రాజధాని న్యాపిడాలో తీసింది.

Image copyright Reuters

ఈ చిత్రం న్యూయార్క్ సమీపంలో తీసింది. 150 ఏళ్లలో తొలిసారి ఈ సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ఏర్పడింది. అమెరికాతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, తూర్పు యూరప్‌ల్లో కూడా ఇది కనిపించింది.

Image copyright AFP

సాధారణం కంటే 7 శాతం పెద్దగా, 15 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తే దాన్ని సూపర్ మూన్‌ అంటారు. పై చిత్రం ఇండోనేషియా రాజధాని జకార్తాలో తీసింది.

Image copyright EPA

అస్తమిస్తున్నప్పుడు సూర్యుడు ఎర్రగా ఉన్నట్లే.. ఇప్పడు చంద్రుడు ఎర్రగా కనిపించాడు. సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి వస్తే.. సూర్య కిరణాలు భూమిపై నుంచి చంద్రుడిపై పడితే.. ఇలా జరుగుతుంది. పై చిత్రం కాలిఫోర్నియాలో తీసింది.

ఇది ఎలా ఏర్పడుతుంది?

సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ఎలా ఏర్పడుతుందో సులభంగా వివరించే వీడియో ఇది. చూడండి..

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఒకేసారి మూడు ఖగోళ అద్భుతాలు

ఆకాశంలో అద్భుతం..

మూడు ఖగోళ అద్భుతాలు ఒకేసారి వచ్చిన ఈ చంద్ర గ్రహణాన్ని నాసా ఇలా బంధించింది..

భారత్‌లో ఇలా..

సూపర్ బ్లూ బ్లడ్ మూన్ భారతదేశంలో కూడా కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది దీన్ని చూశారు. ఈ చిత్రాలను బీబీసీ మరాఠీ ప్రతినిధి రాహుల్ రాన్‌శుభే చిత్రీకరించారు.

చంద్రగ్రహణంపై అపోహలు

అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి? సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అంటే ఏంటి? గ్రహణం గురించి ప్రచారంలో ఉన్న పలు అపోహలు, పలువురి అనుమానాలపై బీబీసీ ప్రతినిధి బళ్ళ సతీశ్ హైదరాబాద్ నుంచి ఫేస్‌బుక్ లైవ్ నిర్వహించారు. ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన రఘునందన్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు ఇందులో మాట్లాడారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం