జైట్లీ బడ్జెట్ రైతులకేమిచ్చింది?

 • 1 ఫిబ్రవరి 2018
రైతులు Image copyright Getty Images

రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు.

తక్కువ పెట్టుబడితో ఉన్న భూమిలోనే ఎక్కువ దిగుబడి సాధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది రైతు సంక్షేమ బడ్జెట్‌గా విత్తమంత్రి అభివర్ణించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇందులోని ముఖ్యాంశాలు.

 • ఈసారి వ్యవసాయరంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలపై ప్రధాన దృష్టి.
 • 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం.
 • గ్రామాల్లో 22,000 వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి.
 • చిన్న, మధ్య తరగతి రైతులు 85 శాతానికి పైగా ఉన్నారు.
 • కనీస మద్దతు ధరను 1.5 రెట్లు పెంచాం.
 • ఆపరేషన్ గ్రీన్ కోసం కేంద్ర వ్యవసాయ శాఖకు రూ.500 కోట్ల కేటాయింపు.
 • వెదురు సాగుకు రూ.1,290 కోట్ల కేటాయింపు.
 • వ్యవసాయ ఉత్పతుల ఎగుమతుల సరళీకరణ.
 • చేపల పెంపకం, ఆక్వా కల్చర్ అభివృద్ధి, పశుసంరక్షణ కోసం రూ. 10,000 కోట్ల నిధి ఏర్పాటు.పంట వ్యర్థాలను తగులపెట్టకుండా, ఇతర ప్రక్రియలో తొలగించడం కోసం ప్రత్యేక సబ్సిడీ.
Image copyright Getty Images

2017-18 బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి కేటాయింపులు ఇలా..

 • గ్రామీణ, వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.87 లక్షల కోట్లు.
 • వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.10 లక్షల కోట్లు.
 • రూ.5,000 కోట్లతో 'పర్ డ్రాప్ మోర్ క్రాప్' పేరిట నాబార్డ్ నిధి.
 • డెయిరీ రంగంలో మౌలిక వసతులు పెంచేందుకు రూ.8,000 కోట్ల నాబార్డ్ నిధి.
 • ఫస్ బీమా యోజన 30 శాతం నుంచి 40 శాతానికి పెంపు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)