బడ్జెట్2018: మీరు తెలుసుకోవాల్సిన 19 ముఖ్యాంశాలు..

  • 1 ఫిబ్రవరి 2018
మహిళా రైతులు Image copyright Getty Images

2018-19 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కొత్త బడ్జెట్‌లోని 19 ముఖ్యాంశాలు ఇవీ..

1. జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం కింద 10 కోట్లకు పైగా పేద కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా. సుమారు 50 కోట్ల మందికి లబ్ధి

2. వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పు లేదు

3. వేతనజీవులకు రూ.40 వేల స్టాండర్డ్ డిడక్షన్. (గతంలో తొలగించిన స్టాండర్డ్ డిడక్షన్‌ను కొత్త బడ్జెట్‌లో తిరిగి ప్రవేశపెట్టారు.)

4. షేర్లపై రూ.లక్షకు మించిన దీర్ఘకాలిక మూలధన లాభాల మీద 10 శాతం పన్ను. స్వల్పకాలిక మూలధన లాభాలపై 15 శాతం పన్ను కొనసాగింపు

5. సౌభాగ్య యోజన కింద నాలుగు కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు

6. ఉజ్వల్ యోజన కింద పేద మహిళలకు ఉచితంగా ఎనిమిది కోట్ల గ్యాస్ కనెక్షన్లు

7. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఐదు కోట్ల మంది గ్రామీణ ప్రజలకు ఇంటర్నెట్ అందించేందుకు ఐదు లక్షల వైఫై హాట్‌స్పాట్ల ఏర్పాటు

8. అన్ని పంటలకు కనీస మద్దతు ధర. ఉత్పాదక వ్యయాలతో పోలిస్తే ఒకటిన్నర రెట్లుగా కనీస మద్దతు ధర

9. వ్యవసాయ ఉత్పాదక సంస్థలుగా నమోదై రూ.100 కోట్లు, అంతకన్నా ఎక్కువ టర్నోవర్ కలిగి ఉన్న కంపెనీలకు మొదటి ఐదేళ్లపాటు 100% పన్ను రాయితీ

10. ప్రస్తుతం రూ.10 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ రుణ మంజూరు లక్ష్యం రూ.11 లక్షల కోట్లకు పెంపు

11. వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి రూ.2 వేల కోట్లతో నిధి

12. సహకార సొసైటీలకు వంద శాతం పన్ను మినహాయింపు

13. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.80 వేల కోట్లు

14. రానున్న ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు అంచనా జీడీపీలో 3.3 శాతం. 2017-18 సంవత్సరానికి ద్రవ్యలోటు సవరిత అంచనా 3.5 శాతం

15. రాష్ట్రాలకు నికర జీఎస్‌టీ కింద రూ.21.57 లక్షల కోట్లు బదలాయించిన కేంద్రం

16. ప్రస్తుత 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నులపై ప్రభుత్వం కోల్పోయే రాబడి రూ.19 వేల కోట్లు

17. రక్షణ రంగ కేటాయింపులు రూ.2.74 లక్షల కోట్ల నుంచి రూ.2.95 లక్షల కోట్లకు పెంపు

18. ప్రతీ ఐదేళ్లకోసారి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పార్లమెంటేరియన్ల వేతన భత్యాల సవరణ

19. టెలికాం శాఖ ఆధ్వర్యంలో ఐఐటీ మద్రాస్‌లో 5జీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)